Ipl spot fixing supreme court mudgal committee lawyer news

ipl spot fixing, mudgal committee, supreme court, bihar cricket board, gurunat meiyappan, n srinivasan, spot fixing cricketers

ipl spot fixing supreme court mudgal committee lawyer news

ఫిక్సింగ్’లో క్రికెటర్ల పేర్లను తేలుస్తామన్న సుప్రీంకోర్టు

Posted: 11/26/2014 11:37 AM IST
Ipl spot fixing supreme court mudgal committee lawyer news

2013 ఐపీఎల్-6 సీజన్’లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో కొంతమంది క్రికెటర్లు, ఇతర ప్రముఖులు పేర్లు అప్పుడే తేలిపోయాయి కానీ.. ఇంకొంతమందితోబాటు శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మయ్యప్పన్’లు ఈ ఫిక్సింగ్’లో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆనాడే వీళ్లు పట్టుబడినా.. అందుకు తగ్గ సాక్ష్యాలకోసం విచారణను జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్గల్ కమిటీ ఈ ఫిక్సింగ్’లో భాగంగా విచారణ జరిపి.. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో శ్రీనివాస్’కు ఫిక్సింగ్’తో ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది కానీ.. అతని అల్లుడు మయ్యప్పన్ మాత్రం బుకీలతో చర్చలు జరిపినట్లు వెల్లడయ్యింది.

ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు తన విచారణలో గురునాథ్ మయప్పన్ తీరును తప్పుపట్టింది. బెట్టింగ్’లో అతనిపాత్ర ఇన్’సైడర్ ట్రేడింగ్’ను తలపిస్తోందని న్యాయమూర్తులు టి.ఎస్.ఠాకూర్, ఖలీపుల్లాలతో కూడిన ధర్మాసనం చెప్పింది. ‘‘మయప్పన్ తన జట్టు సమాచారాన్ని రహస్యంగా చేరవేయడం ద్వారా మరొకరికి బెట్టింగ్’లు కట్టేందుకు సహకరిస్తుంటే.. అది ఇన్’సైడర్ ట్రేడింగ్ లాంటిదే’’ అని వ్యాఖ్యానించింది. అలాగే చెన్నై ఫ్రాంచైజీలో మయప్పన్ పాత్రను కప్పిపుచ్చేందుకు శ్రీనివాసన్ ప్రయత్నాలను ముద్గల్ కమిటీ తన రెండో నివేదికలో ఎందుకు పేర్కొనలేదని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు ముద్గల్ కమిటీ నివేదికలోని క్రికెటర్ల పేర్లనూ తమ తదుపరి విచారణలో పరిశీలించి బహిర్గతం చేస్తామని కోర్టు చెప్పింది.

ఇదిలావుండగా.. ఈ కేసు విచారణలో భాగంగా బిహార్ క్రికెట్ సంఘం (క్యాబ్) తరఫున న్యాయవాది హరీష్ సాల్వే కోర్టులో తమ వాదనను వినిపించారు. మయప్పన్’ను, చెన్నై సూపర్ కింగ్స్’ను కాపాడుకోవడం కోసమే.. ఫ్రాంచైజీలో మయప్పన్ కేవలం ఔత్సాహికుడు మాత్రమేనని, శ్రీనివాసన్’తోబాటు అతడి సంస్థ ఇండియా సిమెంట్స్ చెబుతూ వచ్చిందని వాదించారు. ‘‘నివేదికను వెల్లడి చేయవద్దని బీసీసీఐ కోరుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికను ప్రజల ముందు వుంచడమే ఉత్తమం’’ అని ఆయన కోర్టును విన్నవించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl spot fixing  mudgal committee  supreme court  gurunath meiyappan  telugu news  

Other Articles