Sachin tendulkar clarification heavy weight bat auto biography playing it my way

sachin tendulkar, sachin tendulkar auto biography, sachin tendulkar heavy weight bat, sachin tendulkar news, sachin tendulkar playing it my way book, sachin tendulkar biography, indian cricket players

Finally sachin tendulkar gives clarification on heavy weight bat using in his auto biography playing it my way

బరువైన బ్యాటే సచిన్ ఎందుకు వాడాడో తెలుసా..?

Posted: 11/08/2014 01:09 PM IST
Sachin tendulkar clarification heavy weight bat auto biography playing it my way

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్ మొత్తంలో బరువైన బ్యాట్లనే ఎక్కువగా వాడిన విషయం అందరికీ తెలిసిందే! మిగతా ఆటగాళ్లతో పోల్చుకుంటే సచిన్ బ్యాట్ చాలా ఎక్కువ బరువు వుంటుంది. అంతేకాదు.. ఇతర ఆటగాళ్లకు భిన్నంగా బ్యాట్ హ్యాండిల్ ను బాగా కిందికి పట్టుకుంటాడు. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు చాలామందిని గందరగోళంలో ముంచెత్తాయి. సచిన్ ఎందుకలా బరువైన బ్యాట్ ను వాడుతాడు..? అంటూ ప్రతిఒక్కరు సందేహం వ్యక్తం చేసినవాళ్లే! ఆ విషయాలను సచిన్ అప్పట్లో బహిర్గతం చేయలేదు కానీ.. తన ఆత్మకథ ‘‘ప్లేయింగ్ ఇట్ మై వే’’ మాత్రం విశ్లేషంగా పొందుపరిచాడు. ఆ విశేషాలు సచిన్ మాటల్లోనే...

‘‘నేను ఎప్పుడూ చాలా బరువున్న బ్యాట్లనే వాడాను. అప్పట్లో నాకు చాలామంది తేలికైన బ్యాట్ వాడమని సూచించారు. కానీ నేను అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే.. నా బ్యాట్ లయ అంతా దాని బరువు మీదే ఆధారపడి వుంటుంది. డ్రైవ్ ఆడేటప్పుడు బ్యాట్ బరువుగా వుంటేనే నా శక్తిని బంతి మీద ప్రయోగించగలను. నా టైమింగ్ కూడా దానిమీదే ఆధారపడి వుంటుంది. నా దృష్టిలో మనం వాడే బ్యాట్ మన చేతికి కొసాగింపులా మారాలి. అలాంటి స్థితికి చేరుకున్నప్పుడు ఏ మార్పూ అవసరం వుండదు. నాకు బరువైన బ్యాటే అనుకూలం అనిపించింది కాబట్టి.. తేలికైనా బ్యాట్ వాడలేదు. ఒకవేళ తేలికైన బ్యాట్ వాడివుంటే.. ఇబ్బందులు ఎదురుకావచ్చు’’.

‘‘ఇక నేను పట్టుకునే బ్యాట్ గ్రివ్ గురించి కూడా చాలామంది మాట్లాడేవాళ్లు. నేను ఎప్పటినుంచో బ్యాట్ హ్యాండిల్ కు బాగా కింది భాగంలో పట్టుకుని బ్యాటింగ్ చేస్తాను. ఎందుకంటే.. నా 11వ ఏట నాకంటే పదేళ్లు పెద్దవాడైన అన్నయ్య అజిత్ బ్యాటుతో మొదటగా సాధన చేయడం ఆరంభించాను. అది చాలా పెద్ద బ్యాట్.. పైగా బరువుగా వుండేది. దాన్ని మోయడానికి హ్యాండిల్ కింది భాగంలో పట్టుకుని ఆడాల్సి వచ్చేది. అలా ఆ విధంగా అలవాటైంది. తర్వాత అంతర్జాతీయ కెరీర్ లో నా గ్రివ్ మార్చుకోవాలని ప్రయత్నించాను కానీ ఇబ్బందిగా అనిపించేది. అయితే టెక్నికల్ మార్పులు చేసుకోనని కాదు.. కానీ అలా చేయడం వల్ల నా బ్యాక్ లిఫ్ట్ కాస్త దెబ్బతింది’’ అని సచిన్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles