Hyderabad cricketer ambati rayudu removed from t20 match with west indies

ambati tirupati rayudu, ambati rayudu, cricketer ambati rayudu news, india vs west indies matches, dhawal kulkarni news, indian cricketers, indian bowler akshara patel, bowler mohith sharma, ishant sharma news, suresh raina news, rohit sharma news

hyderabad cricketer ambati rayudu removed from t20 match with west indies

రాయుడికి బీసీసీఐ షాక్! ఆటనుంచి ఔట్!

Posted: 10/15/2014 01:29 PM IST
Hyderabad cricketer ambati rayudu removed from t20 match with west indies

ఐపీఎల్ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులతోపాటు క్రికెట్ దిగ్గజాలనుసైతం ఆకట్టుకున్న రాయుడు... తర్వాత టీమిండియా జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. వన్డే మ్యాచుల్లో కూడా తనదైన ప్రతిభతో జట్టు విజయానికి కీలకపాత్రను పోషించాడు. అంతా సవ్యంగానే జరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా బీసీసీఐ రాయుడికి ఒక పెద్ద షాకిచ్చేసింది. ప్రస్తుతం వెస్డిండీస్ తో జరుగుతున్న మ్యాచుల నేపథ్యంలో రాయుడిని తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

వెస్డిండీస్ తో జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ ఆటగాడు అయిన అంబటి తిరుపతి రాయుడు, ధావల్ కుల్ కర్ణిల స్థానంలో బ్యాట్స్ మన్ మనీష్ పాండే, లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ లను తీసుకున్నట్లు సమాచారం! ఈ నలుగురి ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించిన నేపథ్యంలో మనీష్, అక్షర్ పటేల్ ముందున్న కారణంగా అంబటి, ధావల్ ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో నైట్ రైడర్స్ తరఫును 16 మ్యాచ్ లు ఆడిన మనీష్ 401 పరుగులు చేసి ఆకట్టుకోగా, పంజాబ్ తరఫున అక్షర్ 23.82 సగటుతో 17 వికెట్లు తీశాడు. ఈనెల 22న కటక్ లో ఈ టీ20 మ్యాచ్ జరగనుంది.

ఇదిలావుండగా.. విండీస్ తో జరిగే చివరి రెండు మ్యాచుల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆ మ్యాచుల్లో అంబటి రాయుడు ఆడొచ్చు. అయితే బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ ను అదనంగా చేర్చారు. ఇక మోహిత్ శర్మ గాయపడిన కారణంగా అతని స్థానంలో ఇషాంత్ శర్మను కొనసాగించారు. మరోవైపు విండీస్ తో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు సురేష్ రైనా నాయకత్వ బాధ్యతలు వహించనున్నాడు. 25వ తేదీ నుంచి మూడురోజుల వరకు జరిగే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, జమ్మూ కాశ్మీర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ వున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles