Mumbai indian team out from champion league t20 series after losing the qualifying match

mumbai indian, mumbai indians team, mumbai indian players, kieron pollard, champion t20 league, ccl t20 matches, northern nights team, champions league qualifying matches

mumbai indian team out from champion league t20 series after losing the qualifying match

మొదటి మెట్టు నుంచే జారిపడిన ముంబై!

Posted: 09/17/2014 11:29 AM IST
Mumbai indian team out from champion league t20 series after losing the qualifying match

ముంబై ఇండియన్స్.. రెండుసార్లు ట్రోఫీ గెలిచిన అనుభవం.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా.. ఏ ఇతర జట్లయినా ముంబైతో తలపడేందుకు కాస్త ఒత్తిడికి గురవుతారు! ఎందుకంటే ఎంత లక్ష్యమైనా సరే.. ఆటగాళ్లు తమ ప్రతిభతో బంతిని బౌండరీ లైన్ అవతల పడేసి ఎంతో అలవోకగా గెలిచే సత్తా వుంది. ఒకవేళ మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరు మాత్రమే నమోదు చేసుకున్న.. బౌలర్లు తమ ప్రతిభతో జట్టును గెలిపించగలరు. మొత్తానికి ముంబై జట్టులో అర్హులైన ఆటగాళ్లు బాగానే వున్నారు. దీంతో ఇది డిఫెండింగ్ చాంపియన్ హోదాను మూటగట్టుకుంది. ఈసారి జరగబోయే ఛాంపియన్ లీగ్ టీ20లో ముంబై ఖచ్చితంగా ట్రోఫీని సాధిస్తుందనే నమ్మకాన్ని అందరూ వ్యక్తం చేశారు. కానీ ఆ నమ్మకాలను వమ్ము చేసేసింది ముంబై జట్టు! మొదటి మెట్టు ఎక్కగానే జారిపడి గాయాలపాలయ్యింది.

ఛాంపియన్స్ లీగ్ టీ20 ప్రధాన టోర్నమెంట్ కు అర్హత సాధించడంలో ముందుగా నెగ్గాల్సిన క్వాలిఫయింగ్ టోర్నీలో ముంబై నిరాశపరిచింది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి మ్యాచ్ లో దారుణంగా విఫలమయింది. దీంతో ముంబై ఇండియన్స్ కథ ఇంతటితో ముగిసిపోయింది. మంగళవారం జరిగిన చివరి అర్హత మ్యాచ్ లో నార్తర్న్ నైట్స్ 6 వికెట్ల తేడాతో ముంబైని మట్టికరిపించి ప్రధాన రౌండ్ కు అర్హత సాధించింది. నైట్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలవగా.. లాహోర్ లయన్స్ రెండు విజయాలతో రెండో స్థానంతో ముందంజ వేసింది. ఒకే విజయంతో ముంబై, అసలు ఖాతానే తెరవకుండా సదరన్ ఎక్స్ ప్రెస్ ఘోరంగా విఫలమయ్యాయి. ముంబై ఇంత ఘోరంగా వెనుదిరుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

మొదట టాప్ ఓడి బ్యాటింగ్ ఆడిన ముంబై.. నైట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, ముంబై స్టార్ ఆటగాళ్లను పవెలియన్ కు పంపించడంలో సఫలం అయ్యారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై! ఇందులో పోలార్ట్ 24 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ జట్టు.. మొదట ఓపెనర్లే అద్భుతంగా ప్రదర్శించారు. విలియమ్సన్ 36 బంతుల్లో 53 పరుగులు, డివిసిచ్ 34 బంతుల్లో 39 పరుగులతో మెరవడంతో లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే ముగించేయగలిగారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai indians  champions league t20 2014  northern nights team  

Other Articles