India cricket team create new record worldwide

India cricket team, mahendra singh dhoni, india vs england cricket test match, indian cricket players, indian cricket team records, sachin tendulkar news, ravindra jadeja latest news

India cricket team create new record worldwide : Indian cricket team creates a new record in the first innings of test series by duck out six numbers for the first time. Actually this record has done by bangladesh and south africa in the past days. but now india break this record

టెస్టు మ్యాచ్ చరిత్రలో భారత్ కు చీప్ రికార్డ్!

Posted: 08/08/2014 03:02 PM IST
India cricket team create new record worldwide

భారతీయ క్రికెట్ రంగంలో ధోనీ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటీ నుంచి ఇండియా జట్టు రకరకాల రికార్డులను సృష్టించుకుంటూ వస్తోంది. 28ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ను గెలుచుకుని సంచలనం సృష్టించగా.. ట్వంటీ20 మొదటి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుని బెస్ట్ టీం ఇన్ ద వరల్డ్ గా పేరు సాధించింది. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ట్వంటీ20 మ్యాచుల్లో మొదటిది గెలవగా.. ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ వచ్చింది. అప్పుడప్పుడు మధ్యమధ్యల్లో ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే వుంది. మొన్నటికి మొన్న భారత్ కు భూతంగా మారిన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో తలపడిన ఇండియా జట్టు 28ఏళ్ల తరువాత సంచలన విజయం సాధించి చరిత్రవ్యాప్తంగా ఒక కొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పుడు తాజాగా అటువంటిదే ఒక చీపు రికార్డును సాధించడంలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

ఇంగ్లాండ్ - ఇండియా మధ్య నాలుగో టెస్ట్ సందర్భంగా భారత బ్యాట్స్ మెన్ గతంలో ఎన్నడూలేని విధంగా చాలా చెత్తగా ప్రదర్శించారు. అయితే అదే వారికి ఒక ఘనతను తెచ్చిపెట్టింది. తొలి ఇన్నింగ్స్ లో ఆడిన భారత బ్యాట్స్ మెన్స్ విజయ్, పుజారా, కోహ్లీ, జడేజా, భువనేశ్వర్, పంకజ్ సింగ్ తదితర ఆటగాళ్లు ఒక్క పరుగు సాధించడకుండా డకౌట్ అయ్యారు. భారత్ క్రికెట్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దీంతో గతంలో ఒకే ఇన్నింగ్స్ లో ఎక్కువమంది డకౌట్ అయిన జట్లుగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల రికార్డును భారత్ తిరగరాసింది. భారత్ సాధించిన గొప్ప ప్రపంచ రికార్డుల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది.

ఇంతేకాదు.. ఈ ఘనతతోపాటు భారత్ మరో సంచలన రికార్డును కూడా సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్ లో ఆరుగురు డకౌట్ అయినప్పటికీ.. భారత్ చేసిన 152 స్కోరు అత్యధికం కావడం మరో విశేషం. ‘‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’’ అన్నట్లు.. భారత్ ఒకే టెస్ట్ మ్యాచ్ లోని ఒకే ఇన్నింగ్స్ రెండు అరుదైన రికార్డులు సాధించి.. మరోసారి అరుదైన సంపాదించింది. ఇది మన భారత్ క్రికెట్ జట్టు సాధించిన చీప్ రికార్డ్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles