Indian cricket team loses third test match against england

India loses third test match against england, Indian cricket team loses third test match against england team with high scores, indian cricket team players, indian cricket team loses the match, india vs england cricket match, india vs england latest matches schedules, indian cricket players, england cricket players, mahendra singh dhoni latest news

Indian cricket team loses third test match against england team with high scores

భారత్ ను మూడుచెరువుల నీళ్లు తాగించిన ఇంగ్లాండ్

Posted: 08/01/2014 11:49 AM IST
Indian cricket team loses third test match against england

‘‘లార్డ్స్’’ మైదానంలో 28 సంవత్సరాల తరువాత ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన ధోనీ సేన.. మూడోటెస్టులో మాత్రం మరీదారుణంగా ఓడిపోయింది. ఏవిధంగా అయితే రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆటగాళ్లు అద్భుతంగా ప్రదర్శించారో... అదే మూడో టెస్టుకు వచ్చేసరికి మరీ చెత్తగా విఫలమయ్యారు. మన ఇండియన్ ఆటగాళ్లు ఆడుతున్న తీరును చూసి ప్రతిఒక్కరు.. అసలు మన భారతజట్టు ఆటగాళ్లే ఇలా ఆడుతున్నారా..? అనే అనుమానాలను వ్యక్తం చేసినవాళ్లూ వున్నారు.

మూడో టెస్టులో ఇంగ్లాండ్ తో తలపడిన భారత్ ఏకంగా 266 పరుగుల తేడాతో ఘోరంగా అపజయంపాలయ్యింది. ముందుగా మొదటి ఇన్నింగ్స్ లో ఓ మోస్తరు వరకు రాణించిన బారత బ్యాట్స్ మెన్లు.. రెండు ఇన్నింగ్స్ లో చేతులెత్తేసి.. ఏమి తెలియని అమాయకుల మాదిరి కూర్చుండిపోయారు. మంచి అనుభవం కలిగిన యువఆటగాళ్లతోపాటు దిగ్గజాలు వున్నప్పటికీ.. ఎవ్వరూ తమ ప్రతిభను కనబరలేకపోయారు. చివరిరోజు అజింక్య రహానే 52 పరుగులు చేసి పోరాడినా.. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి మాత్రం ఎటువంటి సహాయం అందలేదు. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు.

మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 569 పరుగులతో భారత బౌలర్లకు చుక్కులు చూపించిన అనంతరం ఆ జట్టు డిక్లేర్డ్ ప్రకటించింది. ఆ తరువాత బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లు మొదట ఇన్నింగ్స్ లో కాస్త మెరుగైన ప్రదర్శనతో 330 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. అదే జోరుతో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులతో అత్యధిక ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. దీనిని ఛేజ్ చేయలేరని తెలిసి కూడా.. బారత బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడకుండా 178 పరుగులకే ఆలౌట్ అయిపోయి... పేలిపోయిన ముఖాలు వేసుకుని కూర్చున్నారు.

భారత్ - ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న మొత్తం ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు చెరొక విజయాన్ని సాధించి, సమఉజ్జీలుగా నిలిచాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన నేపథ్యంలో... రెండో మ్యాచ్ ను భారత్.. మూడో మ్యాచ్ ను ఇంగ్లాండ్ జట్లు గెలుచుకున్నాయి. ఇంకా మిగిలివున్న రెండు టెస్టుల్లో భారత్ రెండింటిని విజయాలుగా మలుచుకుంటే సిరీస్ చేతికి దక్కుతుంది. లేదా.. తట్టాబుట్టా సర్దుకుని తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles