Prime minister narendra modi tweet on india cricket team

pm narendra modi and other celebrities tweeted on Indian cricket team, prime minister narendra modi latest news, prime minister tweet on india cricket team, shane warn tweeted on lords cricket match, vvs laxman tweeted on lords cricket match, india won the match in lords ground against england team, india vs england cricket matches, mahendra singh dhoni tweeted on lords ground winning match

prime minister of india narendra modi and other celebrities tweeted on Indian cricket team

లార్డ్స్ విజయంపై ట్వీట్ చేసిన ప్రముఖులు

Posted: 07/22/2014 11:35 AM IST
Prime minister narendra modi tweet on india cricket team

గతంలో 28ఏళ్ల క్రితం లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ నేతృత్వంలో మొదటి విజయాన్ని సాధించిన టీమిండియా... మళ్లీ ఇన్నాళ్లకు ధోనీ నేతృత్వంలో రెండో టెస్టులో గెలిచింది. ఇందులో విచిత్రమైన విషయమేమిటంటే.... 28ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నేతృత్వంలోనే భారత్ కు తొలి వరల్డ్ కప్ లభించింది. తరువాత ఇన్నాళ్లకు ధోనీ నేతృత్వంలో రెండో ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. దీంతో ప్రతిఒక్కరు ధోనీని ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా... ధోనీ రూపంలో మరో కపిల్ దేవ్ మన భారతదేశంలో జన్మించాడంటూ ప్రతిఒక్కరు కితాబిస్తున్నారు.

భారత్ క్రికెట్ జట్టు లార్డ్స్ లో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకోవడంపై కొంతమంది ప్రముఖులు తమ ఆనందాన్ని నలుగురితో పంచుకున్నారు. ఇందులో భాగంగానే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియా గెలిచిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ... ‘‘లార్డ్స్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి గెలిచినందుకు నా అభినందనలు. మీ గొప్ప ప్రదర్శన మాకు ఎంతో గర్వకారణం. మాకు చాలా సంతోషంగా వుంది’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక భారత్ కెప్టెన్ ధోనీ కూడా... ‘‘ఇది మాకు నిజంగానే చారిత్రాత్మకమైన విజయం. ఎందుకంటే మా జట్టులో వున్న చాలామంది ఆటగాళ్లు గతంలో ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం అస్సలు లేదు. అయినప్పటికీ వారు తమ అద్భుత ప్రదర్శనతో ఇండియాను గెలిపించడంలో మంచి దృక్పథాన్ని కనబరిచారు. 2011 సిరీస్ లో మేము ఇలా ఆడలేకపోయాం. ఆ సిరీస్ మాకు మంచి పాఠాలు నేర్పించింది. దాని ప్రభావం వల్లే ఇప్పుడు నెగ్గగలిగాం’’ అంటూ తమ జట్టు గురించి ప్రశంసలు చేశాడు.

భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియా గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ‘‘చరిత్రలోనే భారత్ కు ఇది అద్భుతమైన విజయం. ధోనీ బృందానికి నా అభినందనలు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మీరు దేశం గర్వించేలా మంచి పని చేశారు. భవిష్యత్తులో ఇటువంటి విజయాలనే సొంతం మన టీమిండియా సొంతం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాట్స్!!’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అలాగే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్.. ‘‘ఇంగ్లాండ్ ను భారత్ చిత్తుగా ఓడించింది. అత్యంత పచ్చని పిచ్ పై ఇంగ్లాండ్ టాస్ గెలిచిన విషయాన్ని మరవద్దు. ఆ జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం వుంది’’ అన్నాడు. అలాగే మైకెల్ వాన్ కూడా.. ‘‘భారత్ జట్టు గెలిచినందుకు నా అభినందనలు. లార్డ్స్ లో అద్భుత విజయానికి మీరు సంపూర్ణంగా అర్హులే. అచ్చమైన ఇంగ్లీష్ పిచ్ పై ఇంగ్లాండ్ కు చుక్కలు కనిపించేలా ఓడించి, మట్టికరిపించారు’’ అంటూ మన మనసులోని మాటను వ్యక్తం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles