Sunrisers hyderabad victory over rajasthan

Sunrisers beat Rajasthan, sunrisers victory over Rajasthan, Indian Premier League 2014, bhuvneshwar kumar, rajasthan royals, Steyn

Sunrisers Hyderabad (SRH) defied all odds to beat Rajasthan Royals (RR) in the Indian Premier League (IPL) 2014 on May 8.

సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ విలవిల

Posted: 05/09/2014 10:18 AM IST
Sunrisers hyderabad victory over rajasthan

గత ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లీగ్ దశలో తక్కువ స్కోర్లే చేసి, తన బౌలింగ్ బలంలో నాకౌట్ దశకు చేరుకొని అందర్ని ఆశ్చర్యపరిచిన ఈ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో ఎక్కువ స్కోరు చేసినా గెలవని సన్ రైజర్స్ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తక్కవ స్కోరే చేసి గత చరిత్రను పునరావ్రుతం చేసి మంచి విజయాల జోరులో ఉన్న రాజస్థాన్ కి బ్రేకులు వేసి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నాకౌట్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.

హైదరాబాద్ బౌలర్లు. భువనేశ్వర్ కుమార్, స్టెయిన్ సంచలన బౌలింగ్‌కు... స్పిన్నర్ల పొదుపు తోడవడంతో 32 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 134 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (20 బంతుల్లో 33; 7 ఫోర్లు) అందించిన శుభారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్ అందుకోవడంలో విఫలమయ్యారు.

చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (21 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) మెరిశాడు. రాజస్థాన్ బౌలర్ షేన్ వాట్సన్ హ్యాట్రిక్ నమోదు హైదరాబాద్ ని కట్టడి చేశారు. మంచి ఊపులో ఉన్న రాజస్థాన్ జట్టు స్వల్ప లక్షాన్ని చేధించడానికి ఆదినుండే కష్టాలు పడింది. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి విలవిలలాడింది. భువనేశ్వర్ (4/14) ధాటికి 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ (33 బంతుల్లో 22) టాప్ స్కోరర్. స్టెయిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్  భువనేశ్వర్ కు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles