Sangakkara jayawardene say goodbye to international twenty20

Sangakkara, Jayawardene, Kumar Sangakkara, Mahela Jayawardene, Sri Lankan team, International Twenty20, ayawardene say goodbye, World T20 warm-up.

Sangakkara-Jayawardene say goodbye to International Twenty20

‘టీ20లకు జయవర్థన్ ’ గుడ్ బై వన్డేలకు సంగక్కర

Posted: 03/18/2014 04:12 PM IST
Sangakkara jayawardene say goodbye to international twenty20

 టీ20 కెరీర్‌కు ఈ వరల్డ్‌కప్పే చివరిదని ప్రకటించిన లంక మాజీ కెప్టెన్ సంగక్కర, వన్డేల్లో రిటైర్మెంట్‌కూ ముహుర్తాన్ని ప్రకటించాడు. అయితే ఇప్పుడప్పుడే కాదు.. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ తర్వాత వైదొలుగుతాడట. రిటైర్మెంట్ కోసం వన్డే, టెస్టులకు ఓ సమయాన్ని నిర్దేశించుకోవడం కష్టమైన పనే. ఇప్పుడు నా వయస్సు 36. వరల్డ్‌కప్ నాటికి 37 ఏళ్లు కూడా నిండుతాయి. 

2019 వరల్డ్‌కప్‌కు 41 ఏళ్లు వచ్చేస్తాయి. అప్పటి వరకు కొనసాగుతాననే ఆశలేదు అని సంగక్కర చెప్పాడు. మరి.. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలెప్పుడు? టెస్టు క్రికెట్‌లో కొనసాగడానికి ఫిట్‌నెస్, ఆస్వాదించే తీరు ముఖ్యం. అయితే ఇక్కడ నేను కెరీర్ చివరి దశకు వచ్చానని అనుకోవడం లేదు అనన్నాడు.

సంగక్కర బాటలోనే మహేల జయవర్దనే కూడా! టీ20 ఫార్మాట్ నుంచి రిటైరవుతునట్టు, ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్పే తనకు చివరి సిరీస్ అని ట్విట్టర్‌లో ప్రకటించాడు.  మొత్తంగా 49 టీ20లాడిన మహేల 31.78 సగటుతో 1335 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో లంక తరుపున అత్యధిక పరుగుల వీరుడు మహేలనే. అంతేకాదు ఓవరాల్‌గా బ్రెండన్ మెకల్లమ్ (64 మ్యాచుల్లో 1959 పరుగులు) తర్వాత రెండోసాన్థం ఇతనిదే.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles