7pl launch postponed

Suresh Raina,Rhiti Sports,MS Dhoni,BCCI,7PL

In a move that has left cricket fraternity in UAE surprised, the organisers of 7PL - upcoming cricket league that was scheduled to be launched by Dhoni.

7పీఎల్ వాయిదాకు ధోనీ కారణమా ?

Posted: 01/11/2014 04:24 PM IST
7pl launch postponed

భారత్ లో అంత్యంత ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ టోర్నీకి ధీటుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన కార్పోరేట్ సంస్థ 7 ప్రీమియర్ లీగ్ (7పీఎల్) పేరుతో టోర్నీని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ టోర్నీలో ఏడు జట్లు పాల్గొనడమే కాకుండా, 7 ఓవర్లతో, ఏడుగురు ఆటగాళ్ళు మాత్రమే పాల్గొంటారని చెప్పి షెడ్యూలును కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ టోర్నీ వాయిదా వేసినట్లు ఆ సంస్థ నిర్వహకులు చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టోర్నీని వాయిదా వేసిస్తున్న ప్రకటించిన వారు ఈ టోర్నీ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది తేదీలు ఖరారు అయిన తరువాత తెలుపుతామని తెలిపింది.

ముందు ప్రకటించిన తేదీల ప్రకారం ఈ టోర్నీ ఈనెల 9వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ఈ టోర్నీలో ధోనికి అత్యంత సన్నిహితుడు, రితి స్పోర్ట్స్ మేనేజ్ మెంటులో ఒకరు ఆ టోర్నీలో భాగసామ్యుడిగా ఉండటంతో దీని పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ధోనీ ఫ్రెండ్ కాదు ధోనీనే ఆ టోర్నీలో పెట్టుబడులు పెట్టారని వార్తలు రావడంతో తాత్కాలికంగా దీనిని వాయిదా వేసి ఉంటారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles