Corey anderson smashes odi world record

corey anderson, jesse ryder, new zealand, black caps, cricket, Shahid Afridi, 37 balls, 36 deliveries

New Zealand all-rounder Corey Anderson cracked the fastest century in one-day cricket history on Wednesday, plundering the West Indies attack in a rain-shortened third ODI.

17 ఏళ్ళ రికార్డులు బద్దలు

Posted: 01/02/2014 09:58 AM IST
Corey anderson smashes odi world record

అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో కొత్త సంవత్సరం వేళ కొత్త రికార్డు నమోదు అయింది. 17 ఏళ్ళ క్రితం అంత్యంత వేగంగా 37 బంతుల్లో సెంచరీ చేసిన పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్ యువ బ్యాట్స్ మెన్ కో్రె అండర్సన్. కేవలం 36 బంతుల్లోనే (14సిక్స్లు, 6 ఫోర్ లు)  పరుగుల సునామీ స్రుష్టించి సెంచరీ సాధించాడు.

ఆండర్సన్ బ్యాట్ ముందు బంతి చిన్న బోయింది, బౌలర్లు నిఛ్చేష్టులయ్యారు. ఆకాశమే హద్దుగా చెలరేగి కొత్త సంవత్సరాన్ని విండీస్ బౌలర్లకు పీడకలగా మిగిల్చాడు. నిన్న విండీస్ తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 159 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్ ని 1-1తో సమం చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వర్షం కారణంగా మ్యాచ్ ని ని 21 ఓవర్లకు కుదించగా 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆండర్సన్ కి తోడు రైడర్ కూడా 51 బంతుల్లో 104 పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ అయిదు వికెట్లు కోల్పోయి 124పరుగులు మాత్రమే చేయగలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles