Sania mirza statements after delhi fashion show rampwalk

sania mirza, sania mirza latest news, sania mirza hot photo shoot, sania mirza ramp walk, sania mirza delhi ramp walk, delhi fashion show, sania mirza tennis star

sania mirza statements after delhi fashion show rampwalk

‘‘అందరిలాగే నాక్కూడా అదంటే చాలా ఇష్టం!’’

Posted: 10/11/2014 03:43 PM IST
Sania mirza statements after delhi fashion show rampwalk

యూఎస్ ఓపెన్నుంచి ఆసియా క్రీడల దాకా టెన్నిస్ కోర్టులో తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ పతకాలను గెలుచుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... చాలారోజుల తర్వాత ఢిల్లీలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో తళుక్కుముంటూ అందరి మనసుల్ని దోచేసుకుంది. గతకొన్నిరోజుల నుంచి కేవలం క్రీడలకు మాత్రమే పరిమితమైన ఈ అమ్మడు... ఇన్నాళ్లు దాచుకున్న తన అందాన్ని ఒక్కసారిగా చూపించడంతో మీడియా కెమెరాలు సైతం ఆమె మీదే దృష్టి సారించింది. అయితే ఈ ఫ్యాషన్ షో అయిపోయిన అనంతరం ఈ విభాగానికి సంబంధించి ఈ అమ్మడు మీడియావాళ్లకు తన మనసులోని మాటలను వ్యక్తపరుస్తూ, కొన్ని దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చిందని సమాచారం!

ఫ్యాషన్ షో అయిపోయిన అనంతరం మాట్లాడిన సానియా మీర్జా... తనకు ఫ్యాషన్ పట్ల ఎంతో ఆసక్తి వుందని, అయితే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తానని పేర్కొంది. ‘‘ర్యాంప్ మీద నడవడం చాలా సరదాగా వుంటుంది. నేను ఏడాది తర్వాత ర్యాంప్ పై నడిచా. అందరి అమ్మాయిల్లాగే నాకూ ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫ్యాషన్ దుస్తులువేసుకుంటాను. ట్రెండుకు తగ్గట్టు దుస్తులు వేసుకోవాలన్న ఆలోచన నాకుండదు. నాకు నచ్చే దుస్తులను మాత్రమే వేసుకుంటాను’’ అంటూ పేర్కొంది. అంటే.. చిట్టిపొట్టి డ్రెస్సులు, లోఅందాలు కనిపించేలా వుండే ట్రాన్స్ పెరెంట్ డ్రెస్సులు వేసుకోవడం తనకిష్టం లేదని అమ్మడు తెలుపుతోందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  delhi fashion show  celebrities hot photos  indian tennis star  

Other Articles