Sania mirza clarifies that she is not interested to act in bollywood movies

sania mirza, sania mirza hot photo shoot, sania mirza photo shoot, sania mirza ramp walk, sania mirza fashion show, sania mirza tennis, sania mirza hot gallery, sania mirza latest news, sania mirz news, sania mirza press meet, sania mirza playing tennis, sania mirza tennis court, sania mirza medals, sania mirza

sania mirza clarifies that she is not interested to act in bollywood movies

చూసి ఆనందిస్తాను కానీ.. చేయడం నావల్లకాదు!

Posted: 10/14/2014 02:50 PM IST
Sania mirza clarifies that she is not interested to act in bollywood movies

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్నటికి నిన్న తన ఫ్యాషన్ లైఫ్ విషయాల గురించి మీడియాతో పంచుకున్న ఈ అమ్మడు... ఇంకొక ఆసక్తికరమైన వార్తను తెలిపింది. తనకు హిందీ సినిమాలు చూడటం చాలా ఇష్టమని పేర్కొన్న సానియా... వాటిల్లో నటించడం తనవల్ల కాదని తేల్చి చెప్పేసింది. గతంలో కొన్ని ఫోటోషూట్ లు ఇవ్వడం, ఫ్యాషన్ షోలలో అందంగా తయారయ్యి అందరి మనసుల్ని దోచుకోవడంతో ఈ అమ్మడు త్వరలోనే సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయం మీదే ఆమెను నేరుగా అడిగితే... అందుకు తనకు సినిమాల్లో నటించడం ఇష్టంలేదని చెప్పేసింది.

టెన్నిస్ మైదానంలో దూసుకుపోతూ.. అప్పుడప్పుడు హాట్ డ్రెస్సులు వేసుకుని తన అందచందాలతో అందరినీ ముగ్ధుల్నిచేస్తున్న ఈ అమ్మడు... కెమెరా ముందుకు రావాలంటేనే చాలా సిగ్గేస్తోందని చెప్పుకొచ్చింది. ‘‘కెమెరాను ఎదుర్కోవాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. బాలీవుడ్ సినిమాల్లో నటించడం పట్ల నాకు అంతగా ఆసక్తి లేదు. కానీ హిందీ సినిమాలు చూడటం మాత్రం నాకు ఎంతో ఇష్టం’’ అని సానియా పేర్కొంది. తన వృత్తి అవసరాలమేరకే పొట్టి దుస్తులను ధరించాల్సి వస్తుందే తప్ప... మైదానం బయటకు వచ్చిన తర్వాత ఆ దుస్తులు అంత సౌకర్యంగా వుండవని తెలిపింది. తనకు పొడవైన దుస్తులు, గౌన్లు ధరించడమే చాలా ఇష్టమని, సినిమాల్లోలాగా పొట్టిపొట్టి దుస్తులు ధరించడం ఏమాత్రం ఇష్టంలేదని తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles