Tennis star sania mirza dont like to share her personal life details

sania mirza, sania mirza personal interview, sania mirza rumours, sania mirza hot photo shoot, deepika padukone, sania mirza movie, deepika padukone movie, sania mirza deepika padukone, indian tennis star

tennis star sania mirza dont like to share her personal life details : sania mirza told that.. she don't like to share her personal details. so thats why she told that there is no need to make a film on her life. If any will take a movie on her life.. then deepika will comfirt for her role sania says...

పర్సనల్ విషయాలపై మండిపడ్డ టెన్నిస్ స్టార్! దీపికపై కామెంట్!

Posted: 10/10/2014 01:28 PM IST
Tennis star sania mirza dont like to share her personal life details

ఇటీవలే చిత్రపరిశ్రమలో వున్న తారలనుంచి మహిళా క్రీడాకారిణుల వరకు అందరికీ సంబంధించిన పర్సనల్ విషయాల మీద అప్పుడప్పుడు రూమర్లు, వార్తలు రావడం సర్వసాధారణం అయిపోయాయి. ఇతరుల విషయాలు అటుంచితే.. తాజాగా భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. తన పర్సనల్ విషయాల మీద మండిపడింది. ఇతరుల లాగా తనకు తన జీవిత విశేషాలను పంచుకోవడం ఏమాత్రం ఇష్టంలేదని బహిరంగంగా చెప్పేసింది. సాధారణంగా కొంతమంది తారలు తమ పర్సనల్ విషయాలను పూర్తిగా కాకపోయినా.. కొంతలో కొంతైనా మీడియాకు లీక్ చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ అమ్మడిని అడిగితే.. తనకసలు ఇష్టం లేదంటూ ఖరాఖండిగా చెప్పేసింది.

అసలు విషయం ఏమిటంటే.. ఏ విభాగంలోనైనా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కొంతమంది ప్రముఖుల జీవిత విశేషాల మీద ఇదివరకే కొన్ని సినిమాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే! ఆ నేపథ్యంలోనే సానియా మీర్జా జీవిత విశేషాల ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించాలని బాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఈ అమ్మడును అడుగగా.. తన జీవిత కథను తెరకెక్కించడం తనకు ఇష్టంలేదని ఓపెన్ గా చెప్పేసింది. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సానియా ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.

తన జీవిత కథను తెరకెక్కించడం ఏమాత్రం ఇష్టం లేదని.. తన జీవిత విశేషాలను ఇతరులకు చెప్పడం తనకస్సలు ఇష్టం లేదని ఆమె తెలిపింది. అయితే ఒకవేళ తనపై ఎవరైనా సినిమా తీస్తే.. అందులో తన పాత్రను దీపిక పదుకొనే పోషిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడింది. ఇదిలావుండగా.. సానియా మీర్జా జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించే విశేషం ఆమెలో అంతగా ఏముందంటూ కొంతమంది విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సానియా గొప్పగా సాధించింది ఏమీలేదని.. ఆమె జీవితంపై సినిమాను తెరకెక్కించాల్సిన అవసరం ఏమీ లేదని పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  deepika padukone  bollywood news  indian tennis star  telugu news  

Other Articles