Sumit Nagal puts up a good fight against Roger Federer ఫెదరర్ కు చమటలు పట్టించిన నాగల్..

India s sumit nagal puts up a good fight against roger federer

us open 2019, Roger Federer, Sumit Nagal, sumit nagal grand slam, abhinav bindra, sumit nagal, nagal, sumit nagal vs roger federer, nagal vs federer, bindra, somdev devvarman, tennis news, sports news, tennis, sports

Sumit Nagal made a dream Grand Slam debut even though it ended in a loss for him. Nagal, who is World No. 190, took on World No. 3 Roger Federer in an intense match and won the first set of the match to became the first Indian to win a set against Federer.

ఫెదరర్ కు చమటలు పట్టించిన నాగల్.. తొలిసెట్ విజయం

Posted: 08/27/2019 07:47 PM IST
India s sumit nagal puts up a good fight against roger federer

20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్ సాగివుంటే భారత యువ షెట్లర్ చరిత్ర సృష్టించేవాడు. గడచిన 25 సంవత్సరాల వ్యవధిలో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు తొలిసారిగా అర్హత సాధించిన భారత యువకెరటం సుమిత్ నాగల్, తొలి రౌండ్ పోటీల్లో వరల్డ్ స్టార్ రోజర్ ఫెదరర్ కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి సెట్ ను 4-6 తేడాతో సునాయాసంగా గెలిచి, ఫెదరర్ కు షాకిస్థాడా? అన్నట్టు కనిపించాడు.

కాగా, ఫెదరర్ అనుభవం ముందు సుమిత్ తలవంచక తప్పలేదు. సుమిత్ షాక్ నుంచి తేరుకున్న ఫెదరర్ వరుస సెట్లలో 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్ ను ఓడించి, రెండో రౌండ్ లో అడుగు పెట్టి, ఊపిరి పీల్చుకున్నాడు. అయితే గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో గత 20 ఏళ్లలో ఓ సెట్ గెలుచుకున్న నాలుగో భారత ఆటగాడిగా సుమిత్ నిలిచాడు. ఓడిపోయినప్పటికీ... ఫెదరర్ వంటి దగ్గజానికి చెమటలు పట్టించాడని అతనిని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

కాగా, 2015లో వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న నాగల్, బ్రెజిల్ కు చెందిన జావో మెనేజస్ ను 5-7, 6-4, 6-3 తేడాతో క్వాలిఫయర్ పోటీలో ఓడించి, యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఈ సంవత్సరం యూఎస్ ఓపెన్ తో నాగల్ తో పాటు ప్రజనేశ్ గుణేశ్వరన్ కూడా ఆడుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us open 2019  Roger Federer  Sumit Nagal  somdev devvarman  abhinav bindra  tennis  sports  

Other Articles

  • Five time grand slam winner maria sharapova announces retirement

    టెన్నిస్ కు మారియా షరపోవా గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ భావోద్వేగం..

    Feb 26 | రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్‌ ప్లేయర్‌.. ఇవాళ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more

  • Serena williams backed over umpire sexism claim after 17k fine

    సెరెనా విలియమ్స్ కు పెరుగుతున్న మద్దతు..

    Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more

  • Icc and wimbledon banter on twitter after roger federer plays cricket stroke

    టెన్నిస్ స్టార్ కు ఐసిసి ఫస్ట్ ర్యాంకు

    Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more

  • Sania mirza shuts down twitter troll for calling her non indian

    నెట్ జనుడికి సానియా మైండ్ బ్లాక్ జవాబు..

    Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more

  • Doubts turn to desperation after andy murray s lost six months

    అండీ ముర్రేకు గాయాలు.. అభిమానల అందోళన

    Jan 05 | బ్రిటన్‌ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌, 3సార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం... Read more