Indian tennis star player sania mirza feeling bad for not celebrating her winning movements with family members

sania mirza, sania mirza latest news, sania mirza shoiab malik, sania mirza asian games, sania mirza tennis, sania mirza interview, sania mirza in airport, sania mirza family members

indian tennis star player sania mirza feeling bad for not celebrating her winning movements with family members

భర్తతోనే సమయం గడపడం లేదు.. ఇక సంబరాలకు తీరికెక్కడ?

Posted: 10/07/2014 05:31 PM IST
Indian tennis star player sania mirza feeling bad for not celebrating her winning movements with family members

యూఎస్ ఓపెన్ నుంచి ఆసియా క్రీడలదాకా వరుసగా టైటిళ్లను గెలుచుకుని, భారత్ గౌరవాన్ని నిలబెట్టిన సానియా మీర్జా... హైదరాబాద్ కు తిరిగొచ్చిన అనంతరం న అనుభూతిని మీడియాతో పంచుకుంది. ఆసియా క్రీడలకు అత్యుత్తమ జట్టుతో వెళ్లలేకపోయినా.. సానియా ఒంటరిగానే పోరాడుతూ తన సత్తా చాటుకుంటూ మెడల్స్ గెలవడంలో సఫలం అయింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం, కాంస్యాలతోపాటు చైనా ఓపెన్ లో మహిళల డబుల్స్ లో రన్నరప్ గా నిలిచింది. ఇన్ని పతకాలను గెల్చుకుని, భారత త్రివర్ణ పతకాన్ని గర్వంగా ఎగురవేయడంలో కీలకపాత్రను పోషించిన సానియా.. తాను సంతోషంగా లేనని, అసలు తనకు తీరికే లేదంటూ పేర్కొంటోంది.

ఆసియా క్రీడల అనంతరం హైదరాబాద్ కు తిరిగొచ్చిన సానియా మీడియాతో కొద్దిసేపటివరకు ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే తాను మంచి ప్రతిభను కనబరిచి మెడల్స్ సాధించారు కదా..? మరి సంబరాలు ఎప్పుడు జరుపుకుంటారు..? లేదా ముందుగానే జరుపుకున్నారా..? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తనకు అందుకు తీరిక లేదని పేర్కొంది. గత 8 వారాలుగా తాను తీరికలేకుండా టెన్ని ఆడుతూనే వుందని, విశ్రాంతి కూడా తీసుకోకుండా శ్రమిస్తూనే వుందని సానియా తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు అనారోగ్యానికి కూడా గురయ్యిందని పేర్కొంది. అంతెందుకు.. తాను భారత్ లో అడుగుపెట్టినప్పుడు ఏ నెలో, ఏ తేదీయో కూడా తెలియదని పేర్కొన్న ఆమె... టైటిళ్లు గెలిచినందుకు సంబరాలు చేసుకునే సమయం దొరకలేదని తెలిపింది. షోయబ్ మలిక్ తో తనకు గడిపే సమయం కూడా దొరకట్లేదని.. తాను సంతోషంగా తన విజయాన్ని ఆస్వాదించుకోవడం లేదని ఆమె తెలుపుతోంది.

అయితే చాలారోజుల తర్వాత కు పదిరోజుల వరకు విశ్రాంతి లభించిందని పేర్కొన్న సానియా.. ఇంట్లోనే తన సమయాన్ని కేటాయిస్తానని తెలిపింది. అలాగే డబ్ల్యూటీఏ ఫైనల్స్ కోసం 17న సింగపూర్ వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మహిళల డబుల్స్ లో సువే (చైనీస్ తైపీ)తో ఆడనున్నట్లు తెలిపింది. అంటే.. వున్న పదిరోజుల విశ్రాంతి సమయం కూడా ప్రాక్టీస్ కే సరిపోతుందని.. అటువంటి నేపథ్యంలో తాను సంబరాలు చేసుకోలేకపోతున్నందుకు చాలా బాధగా వున్నట్లు తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  shoiab malik  indian tennis star players  asian games  

Other Articles