Saket myneni wants to win olympic medal

saket myneni, tennis player saket myneni, saket myneni medals, saket myneni asian games, saket myneni sania mirza jodi, asian games 2014

saket myneni wants to win olympic medal

ఒలంపిక్ మెడక్ కోసం తెలుగుతేజం కసరత్తు!

Posted: 10/04/2014 06:04 PM IST
Saket myneni wants to win olympic medal

ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే రెండు పతకాలను కైవసం చేసుకుని సరికొత్త రికార్డును సృష్టించిన తెలుగుతేజం సాకేత్ మైనేని.. ఇప్పుడు ఒలంపిక్స్ లో మెడల్ సాధించడంకోసం తెగ కసరత్తులు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆసియా క్రీడల నేపథ్యంలో మెన్ డబుల్స్ లో సనమ్ సింగ్ తో కలిసి ఒక సిల్వర్ పతకం, మిక్స్-డ్ డబుల్స్ లో సానియా మీర్జాతో కలిసి గోల్డ్ మెడల్ దక్కించుకున్న విషయం తెలిసిందే! ఏ విధంగా అయితే ఏషియాడ్ లో తన సత్తా చాటుకున్నాడో అదేవిధంగా ఒలంపిక్స్ లో కూడా దూసుకుపోదామనే ప్రయత్నంలో వున్నాడట సాకేత్! అందుకు ప్రభుత్వం కూడా ఇతనిమీదే దృష్టి సారిస్తున్నట్లు అంతర్గత వర్గాలు తెలుపుతున్నాయి.

సీనియర్లంతా దూరమయ్యారు.. ఇక పతకాలు జూనియర్లు ఎలా గెలుచుకుని వస్తారా..? అనే సందేహాల్లో అందరు మునిగితేలుతున్న నేపథ్యంలో.. సాకేత్ తన అద్భుతమైన ఆటతీరుతో రెండు పతకాలను సాధించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడంలో సక్సెస్ అయ్యాడు. అతడు ప్రదర్శించిన ప్రతిభకు తగ్గట్టే అతనికి తన సొంత ఊళ్లో ఘన స్వాగతం లభించింది. వైజాగ్ ఎయిర్ పోర్టులో బంధువులు, క్రీడాభిమానులు, వివిధ క్రీడా సంఘ ప్రతినిధులు గ్రాండ్ వెల్-కమ్ చెప్పారు. గోల్డ్, సిల్వర్ పతకాలను నెగ్గినందుకు తనక్కూడా చాలా ఆనందంగా వుందని.. అయితే ఒలంపిక్ లో మెడల్ గెలవాలన్నదే తన ఆశ అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saket myneni  olympic games  asian games  sania mirza  

Other Articles