Indian tennis star sania mirza disappointed by taj mahal tourist guide in agra

sania mirza, tennis star sania mirza, sania mirza latest news, sania mirza tajmahal, sania mirza medals, asian games, sania mirza hot photo shoot, sania mirza private party photos, sania mirza anil kumble, taj mahal news, taj mahal tourist guide, sania mirza taj mahal tourist guide

indian tennis star sania mirza disappointed by taj mahal tourist guide in agra

సానియా మీర్జాను నిరాశపరిచిన టూరిస్ట్ గైడ్!

Posted: 10/08/2014 01:34 PM IST
Indian tennis star sania mirza disappointed by taj mahal tourist guide in agra

యూఎస్ ఓపెన్ నుంచి ఆసియా క్రీడలవరకు వరుసగా విజయాలు సాధించుకుంటూ పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... ఈ ఆటల నేపథ్యంలో తీరికసమయం లేకుండా గడిపింది. దాదాపు 8 వారాలపాటు కేవలం ఆటలకే తన సమయాన్ని కేటాయించిన ఈ అమ్మడు.. మధ్యలో ఓసారి అనారోగ్యానికి కూడా గురయ్యింది. అయినా వెనక్కి తగ్గకుండా తాను పాల్గొంటున్న క్రీడల్లో సత్తా చాటుకుంటూ పతకాలను గెలుచుకోవడంలో సఫలం అయింది. ఇలా ఈ విధంగా తీరికలేకుండా గడిపిన సానియాకు చాలారోజుల తర్వాత 10రోజుల వరకు మాత్రమే విశ్రాంతి లభించింది. ఈ సమయంలో కాస్త సరదాగా కాలాన్ని గడుపుదామని భావించిన సానియాకు... ఇక్కడ కూడా చుక్కెదురే ఎదురైనట్లు తెలిసింది. ఓ ప్రముఖ స్థలాన్ని సందర్శించుకోవడానికి వెళ్లిన సానియాకు.. టూరిస్ట్ గైడ్ తీవ్రంగా నిరాశపరిచాడనే వార్తలు వస్తున్నాయి.

చాలారోజుల తర్వాత విశ్రాంతి లభించిన నేపథ్యంలో ఆ సమయాన్ని కాస్త సరదాగా గడిపాలని భావించిన సానియా... ప్రపంచంలో వున్న ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ ను వీక్షించాలని భావించింది. ఆ సందర్భంగానే సానియా మంగళవారం సాయంత్రం ఆగ్రాకు విచ్చేసింది. ఇక తాజ్ మహల్ ను సందర్శించాలనే ఆనందంతో అక్కడకు చేరుకున్న ఈ అమ్మడికి టూరిస్ట్ గైడ్ వేద్ గౌతమ్ ఆమెను నిరాశపరిచాడు. సందర్శన సమయం మించిపోవడంతో తాజ్ మహల్ గేట్లను మూసివేసినట్లు అతను తెలిపాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన సానియా.. ఇక చేసేదేమీ లేక దూరంగా నుంచే ఒక ఫోటో తీసుకుని సంతృప్తి పడాల్సి వచ్చింది. అలాగే మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే కూడా మంగళవారం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించినట్టు సమాచారం! ఆగ్రాలోని జైపీ ప్యాలెస్ హోటల్ లో జరగబోయే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరిద్దరు విచ్చేశారని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  taj mahal  anil kumble  taj mahal tourist guide ved gautam  bollywood news  

Other Articles