Telugu badminton star player pv sindhu comments on saina nehwal and her boyfriend

badminton player pv sindhu, saina nehwal, pv sindhu latest interview, saina nehwal latest interview, pv sindhu saina nehwal, indian badminton players, indian sports persons, asian games 2014

telugu badminton star player pv sindhu comments on saina nehwal and her boyfriend

సైనా నెహ్వాల్ కు అంత సీన్ లేదట : సింధు కామెంట్లు

Posted: 09/23/2014 01:37 PM IST
Telugu badminton star player pv sindhu comments on saina nehwal and her boyfriend

బ్యాడ్మింటన్ తెలుగుతేజం పీవీ సింధు.. అంతర్జాతీయ క్రీడాకారణి అయిన సైనా నెహ్వాల్ మీద సంచలన కామెంట్లు చేసింది. ఈమె క్రీడారంగంలో వచ్చి కొన్నాళ్లు మాత్రమే అయినా... తనకంటే సీనియర్ ప్లేయర్ పై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎంతటి స్టార్ ప్లేయర్ అయితేనేం.. తనకు అంత సీన్ లేదంటూ సంచలన కామెంట్లు చేసేసింది. దీంతో అవాక్కయిన మీడియా ప్రతినిధులు.. సింధు ఇలా అనడానికి కారణమేంటా..? అంటూ సందేహంలో పడిపోయారు. ఆ తర్వాత ఆమె అసలు విషయాన్ని బహిర్గతం చేసి అందరి సందేహాలకు ఫుల్ స్టాప్ చేసేసింది.

సంచలన విజయాలతో దూసుకుపోతున్న సింధు.. మీడియాతో కొన్ని విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో సైనా గురించి మాట్లాడిన ఆమె.. తనకూ, సైనాకు మధ్య నిజమైన ఫ్రెండ్ షిప్ లేదని స్పష్టం చేసింది. తామిద్దరి మధ్య మంచి స్నేహం కలిగేంత సీన్ ఇప్పుడే లేదని... అలాగని శత్రుత్వం కూడా లేదని తెలిపింది. తాము కేవలం ‘‘హాయ్, హెలో’’ అని పిలుచుకునేంతవరకు మాత్రమే మిత్రులమని, ఆటల్లో సహ క్రీడాకారులమేనని పేర్కొంది. అయితే సిక్కిరెడ్డి (డబుల్స్ ప్లేయర్)తో తనకు మంచి మిత్రుత్వం వుందని.. అన్ని విషయాలు తనతో షేర్ చేసుకుంటానని ఆమె వెల్లడించింది. దీంతో సైనాకు, సింధుకి చెడిందనే వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయింది.

ఈ ఇంటర్వ్యూలోనే సింధు మాట్లాడుతూ.. తనకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని పేర్కొంది. మహేష్ బాబు, ప్రభాస్ హీరోలు తన అభిమాన నటులని తెలిపింది. అయితే వారి సినిమాలు హిట్ అయితేనే చూస్తానని.. ఫ్లాప్ అయితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చూడబోనని చెప్పింది. అప్పుడప్పుడు తన కుటుంబసభ్యులతోనూ, స్నేహితులతో కలిసి థియేటర్ కు వెళుతుంటానని వెల్లడించింది. ఇక వ్యక్తిగత విషయాల గురించి తెలుపుతూ.. తనకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడని.. తాను ఇంతవరకు ప్రేమలో పడలేదని తెలిపింది. 19 ఏళ్ల సింధు ప్రస్తుతం బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. 18 ఏళ్లకే అర్జున అవార్డును సొంతం చేసుకున్న సింధు.. అంతర్జాతీయ స్థాయిలో టైటిల్స్ గెలుచుకోవాలనే పట్టుదలతో వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles