China badminton coach li yongbo allegations on south korea asian games officials

china badminton team, china badminton coach li yongbo, china south korea badminton match, asian games, china asian games, incheon asian games, south korea asian games, india asian games

china badminton coach li yongbo allegations on south korea asian games officials

ఏసీ గాలీ వల్ల ఓడిపోయిన చైనా!

Posted: 09/27/2014 02:48 PM IST
China badminton coach li yongbo allegations on south korea asian games officials

అటు ఒలంపిక్, ఇటు ఆసియా క్రీడల్లో ఏ విభాగంలోనైనా అత్యంత సులువుగా పతకాలు నమోదు చేసుకొని ప్రపంచదేశాల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించే సత్తా కేవలం చైనా దేశానికి మాత్రమే సాధ్యం! కేవలం ఈ క్రీడల కోసమే ఆటగాళ్లకు కొన్ని సంవత్సరాలపాటు శిక్షణ ఇస్తుంటారు. ఏ విభాగంలోనైనా సరే.. పతకం గెలవడంలో చైనా ఎప్పటికీ వెనకడుగు వేయదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏదో ఒక పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఆసియా క్రీడల్లో కూడా చైనా మెరుపువేగంతో దూసుకుపోతోంది. స్వర్ణ పతకాలను గెలుచుకోవడం కోసం ఇతర దేశాలు అవస్థలు పడుతుంటే.. చైనా మాత్రం అలవోకగా గెలుచుకుంటూ ముందంజలో వుంది.

అన్ని విభాగాల క్రీడల్లోనూ సత్తాచాటుకుంటున్న చైనా.. ముఖ్యంగా బ్యాడ్మింటన్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో పురుషుల విభాగంలో జరిగిన ఫైనల్ లో స్వర్ణం కాకుండా రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి రావడం వారికి తీవ్ర అసహనమే కలిగిస్తోంది. దక్షిణ కొరియా చేతిలో తమ చైనా బ్యాడ్మింటన్ జట్టు ఓడిపోవడంలో కొన్ని అటేతర కారణమయ్యాయని, నిర్వాహకులు తమను ఓడించేందుకు కుయుక్తులు పన్నారని చైనా కోచ్ లియాంగ్ బో ఆరోపించాడు. స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి చైనా, కొరియా చేతిలో ఓడిపోవడం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో తమను ఓడించేందుకు కొరియా కావాలనే పన్నాగం పన్నారని చైనా అధికారులు మండిపతున్నారు.

ఈ నేపథ్యంలోనే మాట్లాడిన చైనా జట్టు కోచ్ లియాంగ్ బో.. ‘‘మేము టెక్నిక్, వ్యూహ వైఫల్యం వల్ల ఓడలేదు. దక్షిణ కొరియా అధికారులు స్టేడియంలో గాలి కదలికల్ని ప్రభావితం చేసి లబ్ది పొందారు. గాలి మావైపు వున్నప్పుడు ఏసీల ప్రభావం మరింత గట్టిగా వీచింది. కానీ వాళ్లు ఆవైపు వున్నప్పుడు ఏసీల ఆపేసి కొరియా జట్టుకు సహకరించారు. పోటీలకు 15 రోజులు ముందే ఇక్కడే సాధనం చేయడం వల్ల ఇక్కడి పరిస్థితుపై పూర్తి అవగాహన వుండటం వల్లే అధికారులు ఇలా చేయగలిగారు’’ అంటూ ఆయన ఆరోపణలు చేశాడు. స్వర్ణం గెలవలేదన్న ఒకే ఒక్క కారణంతో చైనా దేశస్థులు ఇలా అభాండలు వేయడం గమనించదగిన విషయమే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles