China tennis star lee na taking retirement from tennis game

china tennis star lee na, lee na tennis star, tennis stars, lee na latest news, lee na tennis matches, lee na latest interview, lee na social media networkings, lee na twitter, lee na facebook, lee na retirement statement

china tennis star lee na taking retirement from tennis game

ఆ ఒక్క ‘‘గాయం’’ వల్ల లీ నా కెరీర్ మలుపు తిరిగింది!

Posted: 09/19/2014 01:34 PM IST
China tennis star lee na taking retirement from tennis game

ఆసియాలోనే అత్యంత విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు సంపాదించుకున్న చైనా క్రీడాకారిణి జీవితం అనుకోకుండా కొత్త మలుపు తిరిగిపోయింది. తన జీవితంలో జరిగిన ఆ ఒక్క సంఘటన కారణంగా తన కెరీర్ ఇలా చెరిగిపోతుందని ఆమె కూడా ఊహించలేకపోయింది. కానీ, తప్పని పరిస్థితుల్లో తన గుండెను పదిలం చేసుకుని.. ఫైనల్ నిర్ణయం తీసుకోవడం తప్పలేదు. తాను తీసుకోబోతున్న ఈ నిర్ణయానికి తనుకూడా చాలా ఆశేదనను వ్యక్తం చేస్తోంది కూడా! కేవలం 32 ఏళ్ల వయస్కురాలైన ఈమెకు తన జీవితంలో అనుకోని షాక్ లు ఎదురవుతాయని భావించని తరుణంలో... ఆమెకు తగిలిన ఆ ఒక్క గాయం కెరీర్ నే మార్చేసింది.

అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఒకనాడు ఆమె అనుకోకుండా ఒక చిన్న ప్రమాదానికి గురయ్యింది. ఆ ఘటనలో ఈమె మోకాలికి కొంచెం పెద్దగానే గాయం తగిలింది. దాంతో లీ నా గత జూన్ నెల నుంచి టెన్నిస్ ఆటకు దూరంగా వుంటూ వస్తోంది. ఇప్పటికీ ఆ గాయం ప్రభావం తీవ్రంగా వున్న కారణంగా తాను రిటైర్ మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఈమేరక స్థానిక సీఎన్ టీవీ కూడా ఈ చైనా టెన్నిస్ స్టార్ ఆదివారంనాడు తన రిటైర్ మెంట్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు వున్నాయని పేర్కొంది. అయితే అంతకన్నా ముందే లీ నా తన ఈ పదవీ విరమణ ప్రకటనను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, ప్రపంచానికి తెలిపే అవకాశాలున్నాయని మీడియా కథనాలు కూడా వస్తున్నాయి.

రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సొంతం చేసుకున్న ఈ మూడుపదుల టెన్నిస్ క్రీడాకారిణీ లీ నా.. ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఆరో స్థానాన్ని సంపాదించిందుకుంది. గతంలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ (2011), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) తన అద్భుత ప్రతిభతో గెలుచుకోగలిగింది. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా వున్నారు. అయితే ఈమె తాజాగా తీసుకుంటున్న ఈ పదవీ విరమణ నిర్ణయాన్ని విన్న అనంతరం అందరూ నిరాశను వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lee na tennis star  lee na retirement  tennis stars  china country  sports persons  

Other Articles