Sania mirza cara black won the pan pacific open tennis match against casery dellacqua and lisa reymand

sania mirza, sania mirza latest news, sania mirza hot photos, sania mirza latest photo shoot, sania mirza cara black, cara black latest news, sania mirza cara black, pan pacific open tennis games

sania mirza cara black won the pan pacific open tennis match against casery dellacqua and lisa reymand

చివరికి సానియా అన్నంత పనే చేసేసింది!

Posted: 09/18/2014 02:53 PM IST
Sania mirza cara black won the pan pacific open tennis match against casery dellacqua and lisa reymand

కొంతకాలం క్రితం పేలవప్రదర్శనతో డీలా పడిపోయినా సానియా మీర్జా... ఇటీవలే జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో విజయం సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే! ఆ మ్యాచ్ గెలిచినప్పటినుంచి సానియా తన వ్యవహారాన్ని దూకుడుగా ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అదేదో మాటలతీరులోకానీ.. ఇతర వ్యవహారాల్లో కాదులెండి.. తన ఆటలోనే ఆమె దూకుడుగా ముందుకు కొనసాగిపోతోంది. ఎట్టిపరిస్థితుల్లోనైనా తాను ఆడే మ్యాచ్ లలో వెనుదిరగకుండా ఖచ్చితంగా పతకాలు గెలుస్తానని సానియా గతంలో ప్రకటించిన విధంగా ముందుకు దూసుకుపోతోందని తెలుస్తోంది.

పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి తమ అధ్భత ప్రదర్శనతో అవతలి జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ఈ మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ జంట 6-3, 3-6, 10-8 స్కోరుతో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-లీసా రేమండ్ (అమెరికా) ద్వయంపై గెలిచింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌ల్లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను నాలుగేసిసార్లు కోల్పోయాయి. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జంట కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బెన్సిచ్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లతో సానియా-కారా బ్లాక్ జంట తలపడనున్నారు. మరి ఇందులో కూడా తమ సత్తాను చాటుకుంటారో లేదో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  cara black  pan pacific open tennis games  women doubles matches  

Other Articles