Sania mirza changed decision decided to play in asian games 2014

sania mirza, sania mrza latest news, sania mirza changed decision, sania mirza asian games, sania mirza hot photo shoot, sania mirza met narendra modi, sania mirza, asian games 2014

sania mirza changed decision decided to play in asian games 2014

మాటలతో ఊరిస్తున్న సానియా.. ఆకర్షిస్తుందా..? లేదా..?

Posted: 09/13/2014 05:09 PM IST
Sania mirza changed decision decided to play in asian games 2014

నిజంగా చెప్పుకోవాలంటే.. చాలావరకు సెలబ్రిటీలందరూ క్షణాల్లో తమ మాటలు మార్చేసి జనాలను ఊరిస్తుంటారు. ఒక సమయంలో ఒక మాట... ఇంకొక సమయంలో మరో మాట మార్చుకుంటూ జనాలను కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా.. వాళ్లు కూడా సరైన నిర్ణయం తీసుకోవడంలో తర్జనభర్జన పడుతుంటారు. చివరి నిముషందాకా తమ మాటలతో ఊరిస్తూనే వుంటారు కానీ.. ఫైనల్ డెసిషన్ కి మాత్రం ఎప్పటికీ రారు. ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా వుంటుంది. ప్రస్తుతం భారత టెన్సిస్ స్టార్ సానియా మీర్జా వ్యవహారం కూడా అలాగే వుంది. నిన్నటివరకు ఒకే మాట నిలబడతాను అని చెప్పిన ఈ అమ్మడు... ఇప్పుడు సడెన్ గా మాట మార్చేసింది. దీంతో అవాక్కవడం అందరి వంతయ్యింది.

భారతీయ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే వాళ్లు ప్రొఫెషనల్ టోర్నీల్లో పాల్గొంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ అఖిల భారత టెన్నిస్ సంఘం వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సానియా సహా పేస్, బోపన్న, సోమ్ దేవ్ లు ఇంకా తదితర స్టార్ క్రీడాకారులందరూ ఆసియా క్రీడలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని కార్యకలాపాలను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ సానియా మాత్రం ఈ విషయంలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చేసుకుంది. తాను ప్రొఫెనల్ టోర్నీల్లో కాకుండా ఆసియా క్రీడల్లోనే పాల్గొనాలని నిర్ణయించుకుంది. నిన్నటివరకు ర్యాంకు కోసం తహతహలాడిన సానియా... ఇప్పుడు సడెన్ గా ఇలా మాట మార్చడంతో అందరూ ఖంగుతిన్నారు.

ఈ నేపథ్యంలోనే సానియా మాట్లాడుతూ.. ‘‘నా నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. అందుకే ఆసియా క్రీడల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. దీనివల్ల 900 పాయింట్లు నష్టపోతానని తెలిసు కానీ కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పవు’’ అంటూ సానియా పేర్కొంది. అయితే.. సానియా సడెన్ గా తన నిర్ణయం మార్చుకోవడం వెనక ఏమైనా ఒత్తిడి వుందా అని ప్రశ్నించిన తరుణంగా... ‘‘అలాంటిదేమీ లేదు. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లో అవకాశాలు తక్కువగానే వున్నా.. పతకంతో తిరిగొస్తానని ఆశతో వున్నా. ఆ నమ్మకంతోనే నిర్ణయాన్ని మార్చుకున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈమె మాట మారుస్తూ ఊరించినట్లే.. ఆసియా క్రీడల్లో గెలుపొంది అందరినీ ఆకర్షిస్తుందో..? లేదో..? చూడాలి. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ విషయంపై ఆమెతో సహా ఇతర క్రీడాకారులెవ్వరితోనూ ప్రభుత్వం మాట్లాడలేదని ఏఐటీఏ అధ్యక్షుడు అనిల్ ఖన్నా తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  asian games 2014  indian celebrities  indian sports persons  

Other Articles