Pv sindhu saunters past world no 2 to reach badminton

PV Sindhu, Indian shuttler PV Sindhu, Indian shuttler PV Sindhu, Shixian Wang, PV Sindhu tamed World No.2 Shixian Wang, Swiss Open.

PV Sindhu saunters past World No.2 to reach badminton

చెలరేగిన పి.విసిందు-మట్టికరిచిన వరల్డ్ నెం.2

Posted: 03/15/2014 02:58 PM IST
Pv sindhu saunters past world no 2 to reach badminton

 స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ పోటీలలో తెలుగుతేజం పి.వి. సింధు మెరిసింది. వరల్డ్ నెం.2 షిజియాన్ వాంగ్ ను వరుస సెట్లలో ఓడించి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్ లోని సెయింట్ జాకబ్ షల్లెలో జరుగుతున్న ఈ పోటీలలో మరో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ కూడా సెమీస్ లోకి వెళ్లాడు. 

వరల్డ్ నెం.9 ర్యాంకులో ఉన్న సింధు కేవలం 45 నిమిషాల్లో 21-17, 21-15 తేడాతో షిజియాంగ్ కు దిమ్మ తిరిగేలా చేసింది. వాంగ్ ను ఇంతకుముందు ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా సింధు ఓడించింది. సెమీస్ లో చైనాకే చెందిన సున్ యుతో సింధు ఆడనుంది.

అయితే, చైనా గోడను బద్దలుకొట్టడం ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్  వల్ల కాలేదు. వరల్డ్ నెం.3 ఇహాన్ వాంగ్ చేతుల్లో 17-21, 12-21 తేడాతో సైనా ఓడిపోయింది. ఇక పారుపల్లి కశ్యప్ అయితే చైనాకు చెందిన టియెన్ చెన్ చౌను ఓడించాడు. ఈ మ్యాచ్ మాత్రం అత్యంత భీకరంగా ఏకంగా గంటా 14 నిమిషాల పాటు సాగింది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles