Saina nehwal trains sights on swiss open

Saina Nehwal, Swiss Open, Saina trains sights on Swiss Open, Saina, trains, sights.

Saina Nehwal trains sights on Swiss Open

వైఫల్యాల సైనా ఈసారైనా చూపించేనా?

Posted: 03/12/2014 11:44 AM IST
Saina nehwal trains sights on swiss open

ఇటీవల ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ సీరీస్‌లో క్వార్టర్‌ ఫైనల్స్  నుంచే నిష్ర్కమించిన భారత టాప్‌ ఆర్డర్‌ షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ నేటి నుంచి ప్రారంభం కానున్న స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ గోల్క్  టైటిల్‌నైనా సొంతం చేసుకునేనా..?

తాజాగా ఆరో సీడ్‌గా బరిలోకి దిగనున్న సైనా 2011, 2012 సీజన్లలో వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండియన్‌ నెంబర్‌-1 బ్యాడ్మింటన్‌ స్టార్‌ గతేడాది మాత్రం సెమీఫైనల్స్  నుంచి నిష్ర్కమించింది. గతేడాది సెమీస్‌లో పోరాటం ముగించి హ్యట్రిక్‌ విజయాలను కోల్పోయిన ఈ హైదరాబాదీ ఈ సారి విజేతగా నిలిచి మూడోటైటిల్‌ తన ఖాతాలో వేసుకోవడంపైనే దృష్టి సారించింది. 

ఒలింపిక్‌‌సలో కాంస్య పతకం దక్కించుకున్న తర్వాత వరుసగా వైఫల్యాల బాట పట్టిన సైనా... కలిసొచ్చే స్విస్‌ వేదికపై మళ్లీ పూర్వ వైభవం దక్కించుకోవాలిని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో తన మాజీ ప్రత్యర్థి చైనాకు చెందిన టాప్‌ సీడ్‌ యెహన్‌ వాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో సైనా పైచేయి సాధిస్తే మాత్రం క్వార్టర్‌ ఫైనల్స్  వరకు చేరుకోవడం ఖాయమని చెప్పువచ్చు..

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles