Serena williams aims to dispel anxieties in dubai

Serena Williams, dubai, tennis star serena,

Serena Williams aims to dispel anxieties in Dubai

వయసు పెరుగుతున్న సై అంటున్న సెరెనా?

Posted: 02/17/2014 10:57 AM IST
Serena williams aims to dispel anxieties in dubai

నల్ల కలువ .. సై.. సై అంటూ.. దూబాయ్  ఓపెన్ కు సిద్దమవుతుంది. ఒక పక్క పెరుగుతున్న వయసును పట్టించుకోకుండా టెన్నిస్ కెరీర్‌ను కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యే దుబాయ్ ఓపెన్‌కు సిద్ధమైంది. 

33 ఏళ్ల వయసులో మహిళలు టెన్నిస్‌ను ఏలడం, విజయాలు సాధించడం అరుదు. అయితే, సెరెనా గత ఏడాది అద్భుత ప్రతిభ కనబరచింది. అయితే, గత నెల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గాయం కారణంగా ఆమె పోరాటం చివరి వరకూ కొనసాగలేదు. 

ఈ సమస్యను అధిగమించి మళ్లీ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి దుబాయ్ ఓపెన్‌ను ఆమె వేదికగా మార్చుకుంది. అయితే, గాయాల నుంచి ఆమె పూర్తిగా కోలుకుందా లేదా అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. ఈ వయసులో కాలి గాయాలు లేదా వెన్నునొప్పి మొదలైతే, సులభంగా తగ్గే అవకాశం లేదు. 

సెరెనా ఈ అడ్డంకిని ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి. పైగా, 2009 నుంచి ఇప్పటి వరకూ దుబాయ్ ఓపెన్‌లో మూడు పర్యాయాలు ఆడినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెల్చుకోలేకపోయింది. నాలుగో ప్రయత్నంలో ఆమె సఫలమవుతుందో లేదో చూడాలి.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles