the historical story of bhadrakali temple which the sixth avatar of goddess durga devi | telugu mythological stories

Bhadrakali temple mythological history goddess durga avatars

bhadrakali temple history, bhadrakali temple mythological story, bhadrakali temple photos, bhadrakali temple images, bhadrakali temple special story, goddess durga devi, durga avatars, durga mythological story, lord shiva mythological story

bhadrakali temple mythological history goddess durga avatars : the historical story of bhadrakali temple which the sixth avatar of goddess durga devi.

నవరాత్రి 6వ రోజు : భద్రకాళి

Posted: 10/20/2015 03:40 PM IST
Bhadrakali temple mythological history goddess durga avatars

వరంగల్ లో వుండే భ్రదకాళి ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో, ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో కచ్చితమైన వివరాలు ఇంకా తెలియరాలేదు. అత్యంత పురాతనమైన ఈ దేవిని అనాదిగా ఎంతోమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించేవారు. పూర్వం చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి.. వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ ఈ దేవిని పూజించి వెళ్ళాడట. విజయం సాధించిన తర్వాత క్రీ.శ. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు. తరువాత కాలంలో కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు. తదనంతరం కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఈ ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించాడు. కాలగమనంలో ఢిల్లీ బాదుషా అల్లావుద్దీన్ ఖిల్జి చేతిలో కాకతీయులు ఓడింపబడటంతో, సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన ఈ దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది.

క్రీ.శ. 1940లో శ్రీ గణపతి శాస్త్రి అనే దేవీ ఉపాసకులు కర్ణాటక నుంచి జీవనోపాధి వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు.  ఈ ఆలయం చూసి, దానిని పునరుధ్ధరించాలనే కోరికతో ఆలయం పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని వున్నారు. ఆయన శ్రీ ముదుంబాయి రామానుజాచార్యులతో కలిసి స్ధానిక వర్తకులైన శ్రీ మగన్ లాల్ సమేజాగారిని కలిశారు.  శ్రీ సమేజాగారికి కలలో అమ్మవారు కనబడి ఆలయాన్ని పునరుధ్ధరించటానికి ఆయన దగ్గరకు వచ్చేవారికి సహాయం చెయ్యమని ఆదేశించినదట.  ఆ ఆదేశం ప్రకారం శ్రీ సమేజాగారు, ఇంకా ఇతర పెద్దలు కలిసి  ఆలయ పునర్నిర్మాణం తలపెట్టి 1950లో పూర్తిచేశారు. 1950కి ముందు అమ్మవారు భయంకరమైన కళ్ళతో, వేళ్ళాడే నాలుకతో చాలా భీకరంగా వుండేదట. భక్తులు అమ్మ ఆ రూపాన్ని తట్టుకోలేరని ఆలయ పునరుధ్ధరణ సమయంలో అమ్మవారి నాలుకమీద అమృత బీజాక్షరాలు రాసి, నాలుకను సరిచేశారట. చండీ యంత్రం స్ధాపించి అమ్మవారి భయంకరమైన మహాకాళి రూపాన్ని మార్చి మహా త్రిపుర సుందరిగా చేశారట. త్రిపుర సుందరి అంటే మూడు పురములలోనా (మూడు లోకములలోనా) అత్యంత సౌందర్యవతి అని. అప్పటినుంచీ అమ్మ భక్తులను బ్రోచే భద్రకాళి అయింది.

ఆలయ విశేషాలు :

అమ్మవారి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.7 మీటర్ల వెడల్పుతో కూర్చుని వున్నట్లు వుంటుది. అమ్మ అష్ట భుజాలతో వివిధ ఆయుధాలతో అలరారుతూ వుంటుంది. ఈ ఆలయంలో వున్న ఉపాలయాలు ప్రదక్షిణ మార్గంలో … శ్రీ వల్లభ గణపతి, ఆంజనేయస్వామి, శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో శాకంబరి ఉత్సవం, ఆశ్వీయుజమాసంలో శరన్నవరాత్రులు, ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు. విశాలమైన ఆలయం ఇంకా విశాలమైన ప్రాంగణంతో, సుందరమైన పరిసరాలతో  చాలా ఆకర్షణీయంగా వుంటుంది.  ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhadrakali temple history  mythological stories  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more