Ayyappa swamy deeksha mala

ayyappa swamy Deeksha/mala , Ayyappa Swami Deeksha. Deeksha Rules, Puja Saranu Gosha , Ayyappa Swami Niyamalu , Rules Of Ayyappa Deeksha, Ayyappa Puja, Lord Ayyappa

ayyappa swamy Deeksha/mala, Ayyappa Swami Deeksha

అయ్యప్ప స్వామి దీక్ష- మాల

Posted: 12/06/2013 06:11 PM IST
Ayyappa swamy deeksha mala

మండలపూజ మహోత్సహం

16-11-20013 టూ 26-12-2013

అయ్యప్ప పూజ సమయాలు

లార్డ్ అయ్యప్ప

నడ ప్రారంభం - ఉదయం 4.00

నిర్మలయం - ఉదయం 4.05

నెయ్యి అభిషేకం - ఉదయం 4.15 – 11.30

గణపతిహోమం - ఉదయం 4.30

ఉష పూజ - ఉదయం 7.30

అష్టాభిషేకం - ఉదయం 8.00

ఉచ్చపూజ – మద్యాహ్నం 12.30

నడ ముగింపు - మద్యాహ్నం 1.30

తిరిగి నడ ప్రారంభం - సాయంత్రం 4.00

దీపారాధన – సాయంత్రం 6.30

పుష్పాభిషేకం - రాత్రి 7.00

అతజతపూజ – రాత్రి 10.30

హరివరాసనం - రాత్రి 10.50

నడ ముగింపు - రాత్రి 11.00

 

మల్లికాపురం పూజ సమయాలు

నడ ప్రారంభం - ఉదయం 4.00

 

గణపతిహోమం - ఉదయం 4.45

ఉష పూజ - ఉదయం 7.30

ఉచ్చపూజ – మద్యాహ్నం 12.30

 

నడ ముగింపు - మద్యాహ్నం 1.30

నడ ప్రారంభం - సాయంత్రం 4.00

 

దీపారాధన – సాయంత్రం 6.35

భగవతీ సేవ - రాత్రి 7.00

అతజతపూజ – రాత్రి 10.00

నడ ముగింపు - రాత్రి 11.00

మానవ జన్మకి పరమార్ధం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డుతగిలితే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాన్ని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.

 

మాల ధరించుట

భక్తులు కార్తీక మాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.

స్వామియందు నిశ్చలమైన భక్తిభావములు కలిగి, శబరిమలకు 3, 4 సార్లు వెళ్ళొచ్చి, బ్రహ్మచర్య వ్రతమును పాటించేవారిని గురుస్వామిగా ఎన్నుకొని, వారిచేత మాలను ధరించాలి.

దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలాధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువ కూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.

 

నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.

దీక్షావిధి

దీక్ష తీసుకోదలచినవారు ముందుగా గురుస్వాముల ద్వారా ముద్రమాల ధారణ చేయించుకోవాలి.

ఇందుకు సామాగ్రి: నల్లరంగు లుంగీలు లేదా ప్యాంట్లు, నల్లరంగు చొక్కాలు, నల్లరంగు తువ్వాళ్లు, ఇంకా అవసరమైన బనీనులు, డ్రాయర్లు వంటివి కూడా రెండురెండు చొప్పున తీసుకోవాలి. నల్లని దుప్పటి ఒకటి తీసుకోవాలి. దీక్షాకాలం 41రోజులు ఈ వస్త్రాలనే వినియోగించాలి.

తులసిమాల, రుద్రాక్షమాల, గంధంమాల, తామరగింజలమాల, స్ఫటికముల మాల. వీటిలో మీకు నచ్చిన రెండు మాలలు మరియు అయ్యప్పస్వామి ముద్ర (డాలరు) తీసుకోవాలి.

పై సామాగ్రితో బాటు ఒక కొబ్బరికాయ, 6 అరటిపండ్లు, 100గ్రాముల నువు్వలనూనె, అగరువత్తులు, ఒక గంధపు పొడి డబ్బా, వీభూతి పొడి, కొద్దిగా కుంకుమ, కొన్ని పువు్వలు, కొద్దిగా జీడిపప్పు, కిస్‌మిస్‌, పంచదార, కర్పూరం.

పైన చెప్పిన సామాన్లు తీసుకొని గురుస్వాముల వద్దకు వెళ్ళి "దీక్షామాల'' వేయవలసినదిగా ప్రార్ధించగా వారు తెల్లవారుజామున మీరు శిరస్నానం చేసిన తర్వాత, మీరు తెచ్చిన సామాగ్రితో అయ్యప్పస్వామికి పూజచేసి, ముద్రమాలను మీ మెడలో వేసి దీక్షను ప్రారంభిస్తారు.

దీక్షలో పాటించవలసిన నియమాలు

ప్రతిరోజూ ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సంధ్యలలో తప్పనిసరిగా చన్నీటితో శిరస్నానం చేయాలి.

అప్పటివరకూ కట్టి విడిచిన బట్టలను తామే తడిపి ఆరేసి రెండవ జత పొడి దుస్తులను ధరించాలి.

విభూతి దానిపై గంధము, కుంకుమ-దీక్షా తిలకంగా దిద్దుకోవాలి.

దేవాలయంలోగానీ, పూజగదిలోగానీ దీపం వెలిగించి శరణు ఘోషలు చేయవలెను.

ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, అయ్యప్పస్వామికి హారతులిచ్చి సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి. శక్తిమేరకు సాత్వికమైన అల్పాహారం తీసుకోవాలి. అంతటితో ఉదయం కార్యక్రమం పూర్తవుతుంది.

మధ్యాహ్నం చన్నీటి స్నానం చేసి, స్వామికి శరణుఘోషలు చెప్పి, సాత్విక ఆహారాన్ని భుజించాలి.

సాయంసంధ్యలో కూడా చన్నీటి స్నానమాచరించి, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, భజనలు చేసి అల్పాహారమునే స్వీకరించాలి.

వెల్లుల్లి, నీరుల్లి, మద్యపానం, తాంబూలం, ధూమపానాలకు దూరంగా ఉండాలి.

దీక్షలో ఉన్నంతకాలం కటిక నేల మీదనే పడుకోవాలి.

బహిష్ఠులైన స్త్రీలను చూడడం, వారితో మాట్లాడడం చేయకూడదు. స్త్రీలతో లైంగిక సంబంధాలు కూడదు.

పాదరక్షలు ధరించకూడదు. అసభ్యకర సంభాషణ, కోపం అసలు పనికిరావు.

ప్రతిరోజు మూడు పూటలూ శరణు ఘోష చేయవలెను.

పూజాద్రవ్యములు

స్వామి రూపముతో కూడిన తులసిపూసల మాల, తామరపూల దండ, దీపస్తంభాలు, సాంబ్రాణీ కడ్డీలు, కలశపాత్ర, అక్షింతలు, విడిపూలు, ఒక మూల పూలదండ, ఆవుపాలు, పన్నీరు, మంచినూనె, రెండు టెంకాయలు, రెండు కిలోల బియ్యం, పంచపాత్ర, ఉద్ధరిణి, నలుపు లేక కాషాయ వస్త్రాలు.

పూజా విధానము

శ్రీ అయ్యప్ప పటమునకు ముందు ఒక దీపస్తంభం, పటమునకెదురుగా మరొక దీపస్తంభం, అరటి ఆకుపై బియ్యం పోసి దానిమీద ఒక దీపస్తంభం ఉంచవలెను. నాలుగు వైపుల 4 తమలపాకులు రెండేసి వక్కలు, ఒక టెంకాయను వుంచవలెను. మాలను ధరించువారు స్నానం చేసి, నీలవస్త్రమును ధరించి, తమ తల్లిదండ్రులకు నమస్కరించి, జగద్గురువుకు మొక్కి, అయ్యప్పను మనసార స్మరించి, ఆచారప్రకారం విబూదిని ధరించి గురువుకు నమస్కరించి మాలను ధరింప సిద్ధముగా ఉండవలెను.

 

ఇంటివద్ద పూజలు

తమ ఇళ్ల వద్ద పూజలు జరిపించదలుచుకున్న స్వాములు అయ్యప్ప పటములను ఉంచి పూజించవచ్చు. అష్టోత్తర పూజలు, భజనలు, లింగాష్టకం, ఉయ్యాలపాట మొదలగువాటిని 18 ప్రమిదలతో కర్పూర హారతి వెలిగించి ఇవ్వాలి. ఇంటికొచ్చిన స్వాములకు పాద నమస్కారములు చేసి వారికి సగౌరవంగా ఫలహారములు ఏర్పాటు చేయవలెను. ఈ విధంగా పూజలు నిర్వర్తించుకుని - స్వామి దర్శనమునకై ఇరుముడితో సన్నిధికి యాత్ర చేయవలెను.

 

ఇరుముడి సామాన్లు

 

రెండు అరలతో కూడిన ఒక పెద్దసంచి

రెండు చిన్న సంచులు, ఒక దుప్పటి

8 కొబ్బరికాయలు, ఒక కిలో బియ్యం, 6 అరటిపండ్లు, కర్పూరం, అగరువత్తులు, ప్యాకెట్‌చందనం, ఒక తేనె సీసా, ఒక జాకెట్‌గుడ్డ.

పసుపు, కుంకుమ, కిస్‌మిస్‌, జీడిపప్పు, పటిక, పంచదార, అటుకులు, పేలాలు, మిరియాలు, అప్పడం, రోజ్‌వాటర్‌, తమలపాకులు, వక్కలు మొదలగునవి.

శబరిమాల యాత్రా మార్గములు కొట్టాయం వరకూ రైలులో వెళ్లిన తర్వాత అక్కడ నుంచి 86 కి.మీ దూరంలో వున్న ఎరుమేలి, పంబలకు బస్సులోగానీ, కారులోగానీ వెళ్లవలెను. `పంపా' నదిలో స్నానం చేసిన పిదప శబరిమలైలోని స్వామి సన్నిధికి కాలినడకన వెళ్లవలెను.

 

దీక్షా విరమణ

నియమ నిష్ఠలతో శబరిమల యాత్ర పూర్తయ్యాక మాల విసర్జన చేయవలెను.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more