vilambi nama samvasthara ugadi special story ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

Vilambi nama samvasthara ugadi special story

telugu new year day ugadi, telugu traditions, hindus rituals, ugadi pachadi, listening fortune, movement of star, nakshatra gamanamm, telugu new year day, ugadi, vilambi nama samvasthara, brahma, vishnu, farmers, six tastes, ugadi pachadi, festivals, rituals, traditions

telugu new year day is called as ugadi, it is celebrated with telugu traditions and rituals. The speciality of this festival is to hava ugadi pachadi and at the evening listening fortune of the year.

ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

Posted: 03/17/2018 04:37 PM IST
Vilambi nama samvasthara ugadi special story

భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు సంవత్సరాదికి మధ్య చాలా తేడా వుంటుంది. న్యూఇయర్ రోజున అర్థరాత్రి వరకు మేల్కోని దీపాలను(క్యాండిల్స్) ను నోటితో ఊది మరీ సంబరాలను మొదలు పెడితే.. తెలుగు సంవత్సరాది రోజున వేకువ జామునే స్నానాదులు అచరించి.. ఇళ్లకు మామిడి, వేప తోరణాలను కట్టి.. షడ్రుచులతో పచ్చడి చేసి.. దేవుడి వద్ద దీపాన్ని వెలిగించి.. ఉగాది పచ్చడని దేవుడికి సమర్పించిన తరువాత దానినే తొలిగా నోట్లోకి వేసుకుని సంబరపడతా.

ఇంతకీ అసలు ఉగాది అంటే ఏమీటి.?

ఉగస్య ఆది క్రమంగా ఉగాదిగా మారింది. అదెలా అంటే.. "ఉగ" అనగా నక్షత్ర గమనము, దానికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది. 'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది కాబట్టి క్రమంగా యుగాది కాస్తా ఉగాదికా కాలక్రమణ చెందింది.

భారతీయ సనాతన ధర్మం అధునాతన జీవన విధానంలో సమన్వయం అయినా ఆ మార్పులలో కూడా ఇంకా ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు అచరిస్తూ.. ఆధ్మాత్మికంగా భక్తజనకోటి ముందుకు సాగుతుంది. దీంతో ఎన్ని మార్పులు వచ్చినా.. అమ్మలాంటి కమ్మదైనంతో కూడిన పండుగలు కోరితీసుకువచ్చే.. సంబరాలకు మాత్రం ఎప్పటీ కొదవ వుండదనే చెప్పాలి. ఉదాగి ప్రతీ ఏడాది చైత్ర శుక్ల పాడ్యమి నాడే వస్తుంది. అ రోజునే రోజున సృష్టి జరిగిందని పురాణైతికం.

ప్రచూర్యంలో వున్న ఉగాధి కథలు:

* మత్య్యావతారధారియైన మహావిష్ణువు వేదాలను హరించిన సోమకుని వధించి. ఇక వేదాలను పరిరక్షణంతా బ్రహ్మ దేపుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.

* చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, అందుచేత సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది అను పండగను అనవాయితీగా చైత్ర శుక్ల పాడ్యమి రోజున జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది.

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది పండగ పర్వదినాన్ని జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఈ పండగశోజ ఇంటింటా సంతరించుకుంటుంది. ఈ రోజున సాయంత్రం అలయాలకు వెళ్లే భక్తులు అక్కడ వేదపండితులు చేత చెప్పించబడే పంచాంగ శ్రవణాన్ని కూడా విని అనందిస్తారు. ఇది కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరము లోని మంచి చెడులను, కందాయ ఫలములను, ఆదాయ ఫలములను, స్ధూలంగా ఆ ఏడాదిలో తమ భావిజీవిత క్రమము తెలుసుకుంటారు. ఎవరేనీ జాతకంలో ఫలితాలు అంత అశాజకంగా లేవో.. వారు తమ గ్రహశాంతి కోసం ఏం చేయాలన్న విషయాలను కూడా సూచిస్తుంటారు.

ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది-పర్వదినం. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం.

ఈ పండగ పర్వదినం  రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం అచరించి, కొత్త బట్టలు ధరిస్తారు, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఇక ఈ సారి వచ్చే ఉగాది పండగ పేరు విళంబినామ సంవత్సరం. మొత్తంగా అరవై వుంటే తెలుగు సంవత్సరాలలో ఇది 32వ సంవత్సరం. ఆదివారం నాడు వస్తోందికాబట్టి.. విళంబి నామ సంవత్సరానికి అధిపతి రవి. అంటే సూర్యుడు. లోకానికి ప్రత్యేక్ష దైవంగా ప్రతీ ఒక్కరికీ కనిపించ భాస్కరుడూ రాజు అయితే అన్ని జాతకలవారికి రమారమి అనుకూలంగానే వుంటుంది. ఇక మరీ ముఖ్యంగా ఇవాళ తలకు నూనె పట్టించి మరీ స్నానం అచరిస్తారు. నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై వుంటారని ప్రతీతి. దీంతో ఆ ఇద్దరి దేవేరుల అనుగ్రహం భక్తులు పొందుతారని విశ్వాసం.
 
ఇది విళంబి నామ సంవత్సరం కనుక " ఓం విళంబి సంవత్సర దేవతాం సవిత్రే నమః" అని నమస్కారం చేసుకోవాలి. ఈ కొత్త తెలుగు సంవత్సరాది ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఈ సంవత్సరానికి సూర్యుడు. కాబట్టి సూర్యాష్టకం తదితర శ్లోకాలు చదువుతూ పూజ చేయాలి. అలాగే ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి దేవునికి నివేదింయిర తరువాత దానితోనే రోజును ప్రారంభించడం అచారం. విళంబి నామ సంవత్సరం మీకూ మీ కుటుంబసభ్యులకు సంతోషాలను, సిరి, సంపదలను, సకల కార్యాలను నిర్వఘ్నంగా అయ్యేలా చేయాలని అశిస్తూ, అకాంక్షిస్తూ.. తెలుగు విశేష్ తరుపున విళంబి నామసంవత్సర శుభకాంక్షలు

 
 
 

 

 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kanuma festival special

  కనుమ పండుగ విశిష్టత

  Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

 • Bhogi festival special

  భోగభాగ్యాల భోగి పండుగ

  Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

 • Bathukamma the floral festival of telangana

  తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

  Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

 • Dasara navarathri special article

  దసరా శరన్నవరాత్రులు

  Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more

 • Special article on bakrid festival

  త్యాగానికి ప్రతీక.. బక్రీద్ పర్వదినం

  Sep 13 | ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్. దీనికి ఈద్ అల్-అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను... Read more