Kanuma Festival of Cattle with Joy | కనుమ పండుగ.. పాడిపశువులను కొలిచే వేడుక

Kanuma festival special

Kanuma, Kanuma Festival, Kanuma Festival History, Kanuma Festival Specials, Kanuma Kites, Kanuma telugu States

Kanuma, the third day of Sankranti, Celebrates with traditional fervour and joy. Worship of cattle, merry-making and feasts marked the festival, dedicated to cattle that help people in agricultural activities. The day also signifies the lifting of the Govardhan hill by Lord Krishna to protect the people of Gokulam. Though many of the agricultural operations are now mechanised, replacing the ancient methods by use of tractors, the tradition of worshipping the cattle in many parts of the district still continues. “Since bulls play a vital role in farming, ‘Kanuma’ is celebrated as a thanksgiving to the cattle for a bountiful harvest.

కనుమ పండుగ విశిష్టత

Posted: 01/13/2018 11:56 AM IST
Kanuma festival special

సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతం అయిన ఈ గోవర్ధనగిరికి మరియు గోవులకి ఈ కనుమ రోజు పూజ చేయడం జరిగింది.అప్పట్నుంచి ఇప్పటివరకు సంక్రాంతి తరువాతి రోజున కనుమ జరుపుకొంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి మరియు గోవులకు ఎడ్లకూ పూజ చేయడం జరుగుతుంది.

ఇంకా ఈ రోజున పల్లెల్లో రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే పొలి చల్లటం అని అంటారు. అంటే దాని అర్థం ఆ సంవత్సరం పాటు పండే పంటలకు చీడ- పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది వారి నమ్మకం. అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ కలిసి కొద్దిగా కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి పొంగలిని చల్లుతుంటారు. అలాగే మంచి గుమ్మడి కాయను దిష్టి తీసి పగులకొడతారు. కనుమనాడు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను పసుపు, కుంకుమ, పువ్వులు, బెలూన్లతో అలంకరించి పూజించటం జరుగుతుంది. ఆ రోజున వాటితో ఏ పని చేయనీయక వాటిని పూజ్య భావంతో చూస్తారు. ఎందుకంటే పల్లెల్లో పశువులే గొప్పసంపద,అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం, పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు.

కొత్త అల్లుళ్ల కోసం...

మరో ప్రత్యేక అంశం కొన్ని ప్రాంతాల్లో ‘కనుమ' నాడు ‘మినుములు' తినాలనే ఆచారం. అందుకే ‘మినపగారెలు' చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెల్ళిన అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ రోజు కాకి కూడ కదలదని సామెత. కనుమనాడు తప్పక మాంసాహర విభిన్న రుచులను వండుకొని తింటారు. ఆహ్లదకరమైన వాతావరణంలో సంతోషాలు వెళ్ళువిరిసే ‘కనుమ’ అలాగే ఈ రోజున బొమ్మల కొలువు ఎత్తటం అని పేరంటం చేస్తారు.
బొమ్మలకు హారతి పట్టి ఒక బొమ్మను శాస్త్రార్థ పరంగా ఎత్తి పెడతారు. అంతే కాదు గొబ్బెమ్మల పూజలు, హరిదాసుల రాకపోకలు, ఎడ్ల పందాలు, ఎడ్లను ఊరేగించడం, కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, బంతిపూలతో తోరణాలు, కొత్త జంటల విహారాలు, బావమరదల్ల ఇకఇకలు, పకపకలు, చిన్నాపెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగరేయటం.. ఎంతో ఆహ్లదకరంగా ఉంటాయి. ఇదే కనుమ యొక్క ప్రత్యేకత..

జంతు పూజ...

వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - #యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం. ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.

ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.

మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే #జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేద్దాం.

చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది.

తెలుగు విశేష్ తరపున ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more

  • Special article on bakrid festival

    త్యాగానికి ప్రతీక.. బక్రీద్ పర్వదినం

    Sep 13 | ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్. దీనికి ఈద్ అల్-అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను... Read more