1. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణభేద క్లేశ విచ్చేద మంత్రమ్
సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్
2. సంసార సాగర భయాపహ విశ్వమంత్రం
సాక్షాన్ముయుక్షు జనసేవిత సిద్ధ మంత్ర్
సారంగహస్తముఖ హస్త నివాస మంత్రం
కైవల్య మంత్రమనిశం భజ రామమంత్రమ్
3. నిఖిల నిగమ మంత్రం నిత్య తత్త్వాఖ్య మంత్రం
భవమలహరమంత్రం భూమిజా ప్రాణ మంత్రమ్
పవనజనుత మంత్రం పార్వతీ మోక్షమంత్రం
పశుపతి నిజమంత్రం పాతు మాం రామమంత్రమ్
4. దశరథ సుతమంత్రం దైత్య సంహారి మంత్రం
విబుధ వినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రమ్
మునిగణసుత మంత్రం ముక్తి మార్తైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్
5. ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం
ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రమ్
ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశమంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్
6. నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమ మధికం నీతి సుజ్ఞానమంత్రం
సత్యం శ్రీరామమంత్రం సదమల హృదయే సర్వదారోగ్య మంత్రమ్
స్తుత్యం శ్రీరామమంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్యమంత్రం
పఠ్యం శ్రీరామమంత్రం పవనజ వరదం పాతు మాం రామమంత్రమ్
7. సకల భువన రత్నం సచ్చిదానంద రత్నం
సకల హృదయ రత్నం సూర్యబింబాంత రత్నమ్
విమల సుకృత రత్నం వేద వేదాంత రత్నం
పురహర జపరత్నం పాతు మాం రామరత్నమ్
8. నిగమ్ శిశిర రత్నం నిర్మలానంద రత్నం
నిరుపమ గుణరత్నం నాదనాదన్తు రత్నమ్
దశరథ కుల రత్నం ద్వాదశాంతస్థ రత్నం
పశుపతి జప రత్నం పాతు మాం రామరత్నమ్
(And get your daily news straight to your inbox)
Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more
Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more
Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more
Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more
Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more