అల్లం
రెగ్యులర్ డైట్ లో అల్లంను చేర్చుకుంటే.. అది వికారం నుండి ఉపశమనం కలిగించడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లోటింగ్, గ్యాస్ ను నివారిస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల, వ్యాధినిరోధకత శక్తి పెరుగుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా జింజర్ టీ లేదా జింజర్ జ్యూస్ ను తీసుకోవడం చాలా అవసరం.