Rain effect on hyderabad

Rain Effect on Hyderabad, Heavy rains in Hyderabad city, Heavy Rain In Hyderabad,

Rain Effect on Hyderabad

'మెగా నరకం'

Posted: 07/18/2013 12:35 PM IST
Rain effect on hyderabad

స్వర్గం ఎక్కడుందో చాలా మంది బహిరంగంగా చెప్పలేరు గానీ, మెగా నరకం మాత్రం తమ కళ్ళ ముందే ఉందని భాగ్యనగర పౌరులు ఘంటాప దంగా చెప్పగలుగుతారు. వానాకాలం వచ్చిం దంటే చాలు పాఠశాలలకు వెళ్ళే చిన్నారుల్లో భయం, పాదచారుల్లో ఆందోళన, వాహన చోద కులలో కనబడని ఉత్కంఠ. ఈ దుస్థితి రాజధాని హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాలుగా ఉన్నప్పటికీ గత నాలుగు రోజులుగా ఎడతెరిపిగా కురి సిన వర్షాలకు మెగాసిటీ పౌరులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో పాలకులకు సైతం స్పష్టంగా తెలుసు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోని కారణంగా వర్షాకాలంలో వచ్చిపడే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కనుగొనలేక హైదరాబాద్‌ నగర పాలకమండలి, ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరంలో కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయన్నది సుస్పష్టం.

 

చిరు జల్లుకే ప్రధాన రహదారులకు సైతం చిల్లులు పడడం, వీటి ద్వారా ఉదయం ఎనిమిది గంటల సమ యానికే బాలబాలికలు వారివారి పాఠశాలలకు సకాలంలో చేరుకోలేని అవస్థను ఎదుర్కోవడం, వాహన చోదకులు నిర్ణీత గడువులో కార్యాలయాలకు చేరుకోలేక పోవడంతోపాటు ఏ క్షణాన ప్రమాదం జరుగుతుందోనన్న భయం, వ్యాపారస్థులు సకాలంలో తమ దుకాణాలను తెరవలేని పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా మహానగర పాల కమండలి అధికారులుగానీ, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ వారు గానీ తక్షణమే మరమ్మతులు చేపట్టకపోవడం అభ్యంతరకరం. వాన వెలిసిన తర్వాత రహదారుల మర మ్మతులు చేపడతామని జిహెచ్‌ఎంసి ఉన్నతాధి కారులు ప్రకటనలు చేయడం పరిపాటిగా మారింది. ఇక చిత్తడి చేస్తున్న ఈ వర్షాల వల్ల పారి శుద్ధ్య సిబ్బంది కూడా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చెత్తా చెదారం, మురుడు దర్శనమిచ్చి పౌరులను అనారోగ్యంపాలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టని పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more