New flyover bridges in hyderbad

new flyover bridges in hyderbad , amberpet, tollychowki, balanagar

new flyover bridges in hyderbad

13.png

Posted: 10/20/2012 03:32 PM IST
New flyover bridges in hyderbad

tollychowki

నగరంలో కొత్త తరహా ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనున్నారు. టోలీచౌకీ, బాలానగర్, అంబర్‌పేట్‌లలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఇదివరకే సమగ్ర ప్రాజక్టు నివేదికలు పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతానికి టోలీచౌకీ ఫ్లైఓవర్‌కు మోక్షం లభించింది. దీన్ని జీహెచ్‌డీపీ(క్షిగేటర్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కింద జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. దాదాపు 700 మీటర్ల పొడవున ఆరులేన్లతో కూడిన ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం 3.91 కోట్లుగా అంచనా వేశారు. దీనికోసం 25-30 వరకూ ఇళ్లను తొలగించాల్సి రావడంతో భూసేకరణ కోసం మరో రూ.20 కోట్ల వరకూ అదనంగా ఖర్చవుతోంది. స్టూప్ కన్సప్టూంటు సంస్థ ఇదివరకే నమూనా రూపొందించడంతో అధికారులు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ చేప ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫ్లైఓవర్‌కు టోలీచౌకీ చౌరస్తాలోని ఆలయం అడ్డుగా రావడంతో ప్రత్యామ్నాయంగా అధికారులు స్లిట్ టైప్(ఫ్లైఓవర్ మధ్యలో చీలిక ఉండేలా) నమూనాను రూపొందించారు. అంటే ఫ్లైఓవర్ రెండు చివర్లా మామూలుగానే ఉంటూ మధ్యలో గుడివున్న ప్రాంతంలో రెండుగా చీలిపోతుంది. మొదట ఆలయం పైనుంచి నిర్మించాలని భావించినప్పటికీ ఆలయంపై వాహనాల నీడ పడకూడదనే సంప్రదాయం ప్రకారం ఫ్లైఓవర్‌ను రెండుగా విడగొట్టినట్లు అధికారులు తెలిపారు. అంటే ఆలయానికి ఎటువంటి నష్టమూ జరుగకుండా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందన్నమాట. వాహనాల రాకపోకలు ఫ్లైఓవర్‌పై గుడికి ఇరువైపుల నుంచి జరుగుతాయి. సరిగ్గా ఆలయం ఉన్న ప్రాంతంలో ఫ్లైఓవర్ రెండుగా చీలిపోతుంది. మళ్లీ ఆలయం దాటగానే యథావిధిగా కలిసిపోతుంది. ఆలయానికీ, ఫ్లైఓవర్‌కూ కనీసం మీటర్ వరకూ స్థలం ఉండేలా డిజైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో మలక్‌పేట్, గ్రీన్‌పార్క్‌ల వద్ద ఫ్లైఓవర్లు విభిన్న తరహాల్లో నిర్మించగా, వాటికి కూడా భిన్నంగా తాజాగా టోలీచౌకీలో నిర్మించనున్నారు. ఈ తరహా ఫ్లైఓవర్ ఇప్పటికే పూణేలో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.         వాస్తవానికి ట్రాఫిక్ సమస్యను అధిగమించే ఉద్దేశంతో నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి గతంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం(జీహెచ్‌డీపీ) కింద ముందుగా బాలానగర్, టోలీచౌకీ, అంబర్‌పేట్‌లలోని మూడింటిని చేప డీపీఆర్‌లు రూపొందించారు. ఇందులో బాలానగర్, టోలీచౌకీలో ఫ్లైఓవర్లు ప్రతిపాదించిన ప్రాంతాలు ఆర్ అండ్‌బీ శాఖ పరిధిలో, అలాగే అంబర్‌పేట్‌లో ప్రతిపాదిత ప్రాంతం జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉండడంతో వారి అనుమతులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందులో ప్రస్తుతానికి టోలీచౌకీ ఫ్లైఓవర్ నిర్మించేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియ మొదలుపెడుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Silver night music album
Actress trisha father passed away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more