![]() |
![]() హామీలన్నిటికీ కాలం చెల్లినట్టే... రైల్వే బడ్జెట్ కాలం ఇట్టే కరిగిపోయింది. గత ఐదేళ్ల, రెండేళ్ల నాటి హామీలనే 2011-12 సంవత్సరపు బడ్జెట్‌లో పొందుపర్చినా.. ఒక్కటీ నెరవేరలేదు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్నా వీటి ఊసెత్తిన పాపాన పోలేదు. ఆ దిశగా వీరు ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ప్రజా రవాణాలో కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రతిపాదన మొదలుకొని ఆదర్శ రైల్వేస్టేషన్, మౌలిక సదుపాయాల క ల్పన వంటి హామీల్లో ఏదీ అమలుకు నోచుకోలేదు. రోడ్డు అండర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, టర్మినళ్లు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఇంకొద్ది రోజుల్లో రానున్న కొత్త బడ్జెట్‌లో పాత హామీలకే కొత్త మెరుగులు దిద్దుతారా? అంచనాలు మారతాయా? ఈసారైన గత ప్రతిపాదనలకు నిధుల కేటాయింపు జరిగి ప్రాజెక్టుల్లో కదలిక ఉంటుందా? అనేవి మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఊరిస్తున్న వరల్డ్‌క్లాస్.. సికింద్రాబాద్‌ను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలని 2008లో ప్రతిపాదించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేషన్‌ను అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలను కల్పిస్తే...స్టేషన్‌కు చేరుకొనే రైళ్లకు, బయల్దేరే వాటికి, ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు వేర్వేరుగా ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. ఎయిర్‌లెవల్ కన్‌స్ట్రక్షన్స్ వల్ల రైళ్ల రాకపోకలపై ఒత్తిడి తగ్గుతుంది. విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రయాణికులు స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు కూడా కచ్చితమైన పరిమితులు ఉంటాయి. ఇదంతా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రతిపాదనల్లోనే ఆదర్శం.. మల్కాజిగిరిని ఆదర్శరైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ఈ స్టేషన్‌లో 3 ప్లాట్‌ఫామ్‌లు ఉండగా మరో 3 నిర్మిం చేందుకు సరిపడా స్థలం ఉంది. అదనపు ట్రాక్‌ల వల్ల నిజామాబాద్ నుంచి వచ్చే రైళ్ల ఒత్తిడిని నియంత్రించవచ్చు. హైటెక్‌సిటీలో ఉన్న ఎంఎంటీఎస్ స్టేషన్‌ను అభివృద్ధి చేయడం వల్ల మరి కొన్ని రైళ్లను అక్కడికే పరిమితం చేయవచ్చు. కాగితాలపైనే టర్మినళ్లు.. ప్రయాణికుల టర్మినల్స్ కోసం 300 ఎకరాలు, సరుకు రవాణా టర్మినళ్లకు 600 ఎకరాల భూమి కేటాయించాలని గతంలో సర్కార్‌ను కోరారు. మల్కాజిగిరి లేదా హైటెక్‌సిటీలో ప్రయాణికుల టర్మినళ్లు, తిమ్మాపూర్ లేదా, చర్లపల్లిలో రవాణా టర్మినళ్లు కట్టించాలని ప్రతిపాదించారు. వీటి వల్ల సికింద్రాబాద్ , నాంపల్లి, కాచి గూడ రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. వంతెనలూ అంతే.. లక్డీకాఫూల్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జీలు మినహా మిగతావన్నీ నిలిచిపోయాయి. ఆరాం ఘర్ చౌరస్తా, రైల్‌నిలయం, ఆలుగడ్డబావి, సంజీవయ్యపార్కు, బుద్వేల్ -ఉందానగర్, ఉప్పుగూడ-యాకుత్‌పురా, ఉప్పుగూడ-ఫలక్‌నుమా, సఫిల్‌గూడ రైల్వేస్టేషన్,అమ్ముగూడ-మౌలాలి ప్రాం తాల్లో రోడ్డు అండర్ బ్రిడ్జీలు,ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి రెల్వే ప్రణాళికలను రూపొం దించింది. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సమకూర్చే నిధులతో వీటి నిర్మాణం, విస్తరణ జరగాల్సి ఉంది. |
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more