Telugu tv anchor cum actor suresh

TV Anchor and Actor Suresh, Anchor suresh, Actor suresh, cine artist suresh, Gemini suresh, TV Anchor suresh interview, cine artist suresh interview.

Telugu tv anchor cum actor suresh interview.

Telugu tv anchor cum actor suresh.png

Posted: 11/30/2012 03:39 PM IST
Telugu tv anchor cum actor suresh

Sureshటీవీ పెడితే బోలెడంత మంది యాంకర్లు కనిపిస్తారు. కానీ వాళ్లలో కొందరు మాత్రమే గుర్తుండిపోతారు. సురేశ్ ఆ కొందరిలో ప్రముఖుడు. కామెడీ చేసి నవ్విస్తాడు. ఇంటర్వ్యూలు చేసి అలరిస్తాడు. ఒకేసారి రెండు పాత్రల్లో కనిపించి మురిపిస్తాడు. అయితే... ఏం చేసినా తనదైన స్టయిల్లో చేస్తాడు. అందుకే అతడు ఎంతోమందికి అభిమాన యాంకర్ అయ్యాడు. యాంకరింగ్‌కి ఓ కొత్త స్టయిల్‌ను తీసుకొచ్చిన సురేశ్‌తో మాటా మంతీ.

మిమ్మల్ని జెమిని సురేష్ అని ఎందుకంటారు ?

నా గురించి అందరికీ తెలిసింది జెమినీ చానల్ వల్లే. అక్కడ ఉద్యోగిగా చేరి, యాంకర్‌గా పాపులర్ అయ్యాను. అందుకే ఆ చానల్ పేరే నా ఇంటిపేరుగా మారిపోయింది.

యాంకర్ అవ్వాలని ఎందుకనుకున్నారు ?

యాంకర్ అవ్వాలని అనుకోలేదు. నటుడిని అవ్వాలని అనుకున్నాను. మాది భీమవరం. డీఎన్నార్ కాలేజీలో చదువు కున్నాను. ప్రతి సంవత్సరం యూత్ ఫెస్టివల్లో పాల్గొనేవాడిని. స్కిట్లు రాసే వాడిని. షోలు చేసేవాడిని. పాటలు పాడే వాడిని. రెస్పాన్స్ అదిరిపోయేది. దాంతో నటుడినైపోవాలని డిసైడయ్యాను.

మరి యాంకరెందుకయ్యారు ?

ఎంబీయే అయ్యాక హైదరాబాద్ వచ్చి బ్లూడార్ట్ కొరియర్స్‌లో పనికి చేరాను. మనసు మాత్రం నటన మీదే. కానీ సినిమా లంటే మాటలు కాదుగా ! ఈలోగా ఈటీవీలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా చేరాను. తర్వాత యాంకరయ్యాను. కొన్నాళ్లకు జెమినీ నుంచి పిలుపొచ్చింది. అక్కడ బాగా బిజీ అయిపోయాను.

కామెడీ బాగా చేస్తారు. హ్యూమర్ మీలో ఉందా లేక కావాలని డెవెలప్ చేసుకున్నారా ?

మా భీమవరంలో టీకొట్టువాడిని, కూరగాయల వాడిని కదిపినా సెటైరిక్‌గానే మాట్లాడతారు. గోదావరి జిల్లాల వారికి హ్యూమర్ బ్లడ్‌లో ఉంటుందనుకుంటా !

ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్ ?

ఓసారి నేను ‘స్మైల్ ప్లీజ్ ’ షూటింగ్‌లో ఉండగా హీరో రాజేంద్రప్రసాద్‌గారు మా స్టూడియోకొచ్చారు. ‘నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్టు ఉంటుందిరా, భలే చేస్తావ్ ’ అంటూ మెచ్చుకున్నారు. ఇంకోసారయితే చిరంజీవి కబురుపెట్టారు. వెళ్తే, షోలో డ్యూయల్ రోల్ బాగా చేస్తున్నావ్, ఎలా చేస్తావో చెప్పు అని అడిగారు. అప్పుడాయన అందరివాడు చేస్తున్నారు. ఇవన్నీ జీవితంలో మర్చిపోలేనివి.

ఓ యాంకర్‌గా మీకు నచ్చే యాంకర్ ఎవరు ?

చదువుకునే రోజుల్నుంచి ఇప్పటి వరకూ ఒక యాంకర్‌ని చూసి ఆశ్చర్యపో తుంటాను నేను. ఆవిడే సుమ. తెలుగు వారు కాకపోయినా అంత అద్భుతంగా ఎలా మాట్లాడగలరో !  ఆమెతో మాట్లాడా లంటే కాస్త భయంగా ఉంటుంది నాకు...ఆవిడంత బాగా మాట్లాడలేనేమో అని !

ఈ ఫీల్డ్‌లో పోటీ ఎలా ఉంటుంది ?

అన్నిచోట్లా ఉన్నట్టే ఉంటుంది. నిజానికి యాంకర్ అంటే అమ్మాయే. ఆడవాళ్లూ వాళ్లనే చూస్తారు, మగాళ్లూ వాళ్లనే చూస్తారు. కాబట్టి మగాళ్లు యాంకర్‌గా సక్సెసవడం కష్టం. కాకపోతే మనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకుంటే నిలబడతాం.యాంకర్‌గా నిలబడ్డారు సరే.

నటన సంగతి ?

త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్... కాలేజీలో నా సీనియర్లు. వాళ్లు నాకంటే ముందు ఇండస్ట్రీలో సెటిలైపోయారు. కానీ నేను వాళ్లను అవకాశం ఇవ్వమనో ఇప్పించ మనో అడగలేదు. అడగను కూడా. త్రివిక్రమ్ ఓసారి అన్నాడు. ఏదో ఒక రోజు నీకు మాంచి రోల్ ఇస్తాను, దాంతో నీ జీవితం మారిపోతుంది అని. ఆ చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకూ నలభై వరకూ సినిమాల్లో చేశాను. తేజం, అలలు వంటి సినిమాల్లో హీరోగా కూడా చేశాను. శ్రీనువైట్ల ‘రెడీ’లో మంచి పాత్ర ఇచ్చారు. అది చాలా పేరు తెచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ బ్రోకర్, ఫేస్‌బుక్ చిత్రాల్లో చాలా మంచి రోల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఓ ఐదింట్లో నటిస్తున్నాను.

Anchor_sureshఇది సరిపోతుందంటారా ?

లేదు. ఇంకా కావాలి. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. యాంకర్‌గా ముప్ఫై వరకూ అవార్డులు అందుకున్నాను. నటుడిగా ఒక్క నందినైనా అందుకోవాలి. అప్పుడుగానీ నాకు నిద్రపట్టదు.

నాన్న చిన్నప్పుడే చనిపోతే అమ్మ కష్టపడి పెంచింది నన్ను. ఆ స్థితిలో ఉన్నవారెవరైనా ‘బాగా చదువుకో, మంచి ఉద్యోగం సాధించు’ అని చెబుతారు. కానీ మా అమ్మ మాత్రం నా ఆసక్తిని గమనించింది. ఆ ఆశను అర్థం చేసుకుని ప్రోత్సహించింది. అందుకే అమ్మంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను లేను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Tv actor gurmeet choudhary interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with prachi desai

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

  • Interview with mogalirekulu fame karuna

    మొగలిరేకులు ఫేం కరుణతో

    May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Tv actor gurmeet choudhary interview

    Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

  • Mogalirekulu ravi krishna interview

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more