grideview grideview
  • Jan 10, 02:48 PM

    వేమన శతకం-45

    హీనగుణమువాని నిలుజేరనిచ్చిన నెంతవానికైన  నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ హీనగుణమువాని- గుణం తక్కువవాడిని, ఇలుచేరనిచ్చిన- ఇంటికి రానిస్తే, ఎంతవానికైన- ఎలాంటివాడికైనా, ఇడుము కలుగు- నష్టం వాటిల్లుతుంది, ఈగ కడుపుజొచ్చి- ఈగ కడుపులోకి పోయినట్లైతే, ఇట్టట్టు...

  • Jan 06, 03:01 PM

    వేమన శతకం-44

    విద్యలేనివాడు విద్యాధికుల చెంత నుండినంత బండితుండు కాడు కొలని హంసలకడ గొక్కెరయున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ విద్యలేనివాడు= చదువుకోనివాడు, విద్యాధికులచెంత= చదువుకున్నవారి వద్ద, ఉండినంత= ఉన్నంతమాత్రాన, పండితుండు కాడు= పండితుడైపోడు, కొలని= కొలనులో, హంసల కడ= హంసల దగ్గర కొక్కెరఉన్నట్టు= కొంగ ఉన్నట్టు...

  • Dec 26, 05:51 PM

    వేమన శతకం-43

    కానివానితోడ గలసి మెలగుచున్న గానివానిగానె కాంతురవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ కానివానితోడ = చెడ్డవానితో, కలసి మెలగుచున్న = కలిసి తిరిగితే, కానివానిగానె = చెడ్డవాడిగానే, కాంతురు = చూస్తారు, అవని = ప్రపంచంలో, త్రాటికింద...

  • Dec 22, 03:37 PM

    వేమన శతకం-42

    తనువు దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరి సొమ్ము దాచుకొనగ ప్రాణ మెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమ తనువు=శరీరము, ఎవరి సొమ్ము=ఎవరి సొంతం, తనదని పోషించి=తనదనుకుని పెంచుకోవటానికి, ద్రవ్యము=ధనము- డబ్బు, దాచుకొనగ=దాచిపెట్టుకోవటానికి ఈ శరీరమెవరిది పెంచి పోషించటానికి,...

  • Dec 20, 04:24 PM

    వేమన శతకం - 41

    ఆపదైన వేళ నరసి బంధుల జూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినురవేమ ఆపదైన వేళ = ఆపద కలిగిన సమయంలో, బంధుల జూడు = చూసేవాడే బంధువు, భయమువేళ = భయం కలిగే సమయంలో, జూడు బంటుతనము =...

  • Dec 15, 06:19 PM

    వేమన శతకం-40

    తరువ దరువ బుట్టు దరువునందనలంబు దరువదరువ బుట్టు దధి ఘృతంబు తలపదలప బుట్టు తలపున తత్త్వంబు విశ్వదాభిరామ వినురవేమ తరువదరువన్=తరచగా తరచగా, పుట్టు=పుడుతుంది, తరువునందు=చెట్టులో, అనలంబు=నిప్పు, దధి=పెరుగు, ఘృతంబు=నెయ్యి, తలపుదలపు=బాగా ఆలోచించగా ఆలోచించగా, పుట్టు తలపున=మనసులో పుడుతుంది, తత్త్వంబు= ధర్మ సూక్ష్మం....

  • Dec 13, 04:19 PM

    వేమన శతకం - 39

    అరయ నాస్తియనక యడ్డు మాటాడక తట్టువడక మదిని తన్నుకోక తనది గాదనుకొని తా బెట్టునదె పెట్టు విశ్వదాభిరామ వినురవేమ! అరయన్=చూడగానే, నాస్తియనక=లేదని చెప్పకుండా, అడ్డు మాటాడక=అభ్యంతరం చెప్పకుండా, తట్టువడక=సంశయించకుండా, మదిని తన్నుకోక=మనసులో కొట్టుమిట్టాడకుండా, తనదిగాదనుకొని=తన సొమ్ము కాదని తలచి, తాబెట్టునదె=ఇచ్చేదే, పెట్టు=నిజమైన...

  • Dec 10, 01:53 PM

    వేమన శతకం 38

    వేమన శతకం- 38     కులముగలుగువాడు గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగువాడు పసిడిగలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ కులముగలవాడు=ఉన్నత కులంలో పుట్టినవారు, గోత్రంబు గలవాడు=గోత్రం కలిగినవారు, విద్యచేత విర్రవీగువాడు=బాగా చదువుకున్నానన్న గర్వంతో ఉన్నవారు, పసిడికలుగువాని=ధనం కలిగివున్నవారికి, బానిసకొడుకులు=చెప్పుచేతల్లో ఉండవలసిందే....