Vemana Sathakam in Telugu 30460 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu విద్యలేనివాడు విద్యాధికుల చెంత Vemana satakam

Get the Vemana Sathakam హంసల మధ్యలోనే తిరుగాడినా కొంగ ఎప్పటికీ కొంగే. అలాగే చదువుకున్న వాళ్ళ మధ్య తిరుగుతూ కాలం గడిపినంత మాత్రాన విద్యావంతుడనిపించుకోరు. In Telugu Vemana Satakalu

వేమన శతకం-44

Posted: 01/06/2012 03:01 PM IST

vemana-inner

విద్యలేనివాడు విద్యాధికుల చెంత

నుండినంత బండితుండు కాడు

కొలని హంసలకడ గొక్కెరయున్నట్టు

విశ్వదాభిరామ వినురవేమ

విద్యలేనివాడు= చదువుకోనివాడు, విద్యాధికులచెంత= చదువుకున్నవారి వద్ద, ఉండినంత= ఉన్నంతమాత్రాన, పండితుండు కాడు= పండితుడైపోడు, కొలని= కొలనులో, హంసల కడ= హంసల దగ్గర కొక్కెరఉన్నట్టు= కొంగ ఉన్నట్టు

హంసల మధ్యలోనే తిరుగాడినా కొంగ ఎప్పటికీ కొంగే. అలాగే చదువుకున్న వాళ్ళ మధ్య తిరుగుతూ కాలం గడిపినంత మాత్రాన విద్యావంతుడనిపించుకోరు.

హంస అనే పక్షిని పురాణాల్లో వర్ణిస్తారు. పూర్వకాలం ఆ జాతి పక్షులుండేవని నమ్మకం. హంసలకుండే లక్షణాలు- స్వచ్చమైన తెల్లదనం, సుందరమైన రూపం, దేవతల పక్షి అనే పేరు, భూమ్మీదనే కాకుండా దేవలోకంలో కూడా విహరిస్తుంటాయని నమ్మకం, స్వచ్ఛతకు మారుపేరైన హంసకి పాలల్లో నీళ్ళు కలిపి ఇచ్చినా అందులోంచి హంస పాలని తాగి నీళ్ళని వదిలిపెట్టగలిగే విశేష సామర్థ్యం. కొంగలు కూడా తెల్లగా ఉన్నా, కొలనుల్లోనే విహరించినా, అది ఎప్పటికీ హంస లక్షణాలను సంతరించుకోలేదు. అలాగని హంసలతో తిరుగుతూ ఉంటే వాటి లక్షణం ఏమైనా అంటుకుంటుందా అంటే అద ఎలా సంభవం.

కష్టపడి విద్యార్జన చెయ్యకుండా కేవలం ఙానులతో తిరిగినంత మాత్రాన ఙానులైపోరెవరూ. వారు మాట్లడే మాటల్లో కొన్ని పట్టుబడవచ్చంతే. చిలక పలికే పలుకుల్లా వాటి అర్థం సరిగ్గా తెలియకుండానే వాటిని ఉపయోగిస్తూవుండవచ్చేమో కానీ, విద్యావంతుడవటానికి అది మార్గం కాదు. విద్యనభ్యసించిన తర్వాత విద్యావంతులతో కలిసి చర్చించుకోవచ్చు కానీ ఏమీ చదవకుండానే ఒట్టిగా వాళ్ళతో తిరిగి ఏదో గడించవచ్చనుకుంటే పొరపాటవుతుందని వేమనాచార్యుల హెచ్చరిక

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
Vemana satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more