Vemana Sathakam in Telugu 30076 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu ఆపదైన వేళ నరసి బంధుల జూడు Vemana satakam

Get the Vemana Sathakam ఆపదలో ఉన్నప్పుడు చేయూతనిచ్చినపుడే బంధువు అనిపించుకుంటారు. భయంకలిగే సందర్భంలో ధైర్యంగా ఉన్నప్పుడే ఆ మనిషిలోని సాహసం బయటపడుతుంది. పేదరికంలో కూడా భర్తను గౌరవంగా చూసినపుడే భార్య గుణం బహిర్గతమవుతుంది. In Telugu Vemana Satakalu

వేమన శతకం - 41

Posted: 12/20/2011 04:24 PM IST

vemana-inner

ఆపదైన వేళ నరసి బంధుల జూడు

భయమువేళ జూడు బంటుతనము

పేదవేళ జూడు పెండ్లాము గుణమును

విశ్వదాభిరామ వినురవేమ

ఆపదైన వేళ = ఆపద కలిగిన సమయంలో, బంధుల జూడు = చూసేవాడే బంధువు, భయమువేళ = భయం కలిగే సమయంలో, జూడు బంటుతనము = సాహసము చూడవచ్చు, పేదవేళ = సంపదలు పోయి పేదరికం కలిగినపుడు, జూడు పెండ్లాము గుణమును = అదరించే భార్య గుణం కనపడుతుంది.

ఆపదలో ఉన్నప్పుడు చేయూతనిచ్చినపుడే బంధువు అనిపించుకుంటారు.  భయంకలిగే సందర్భంలో ధైర్యంగా ఉన్నప్పుడే ఆ మనిషిలోని సాహసం బయటపడుతుంది.  పేదరికంలో కూడా భర్తను గౌరవంగా చూసినపుడే భార్య గుణం బహిర్గతమవుతుంది. 

బంధువునని చెప్పుకుంటూ తిరగటం కాదు.  ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే బంధువు అన్నదానికో అర్థముంటుంది.  అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అందరూ ధీశాలులే.  భయాందోళన కలిగే సందర్భాల్లోనే వారి అసలు ధైర్య సాహసాలు వెల్లడవుతాయి.  భర్త సంపాదించినంత కాలం గౌరవంగా చూడటం కాదు, సంపదలుడిగినపుడు కూడా అంతే గౌరవంతో చూసినప్పుడే భార్య లోని సుగుణం తెలుస్తుంది.  భార్యా భర్తలు కానీ ప్రేమికులు కానీ అవకాశం చిక్కినప్పుడల్లా ఐ లవ్ యూ అనటం కాదు, భర్త ఆస్తి కరిగిపోయి జవసత్వాలుడిగిన సమయంలో కూడా గౌరవంగా చూస్తేనే ఆదర్శవంతమైన భార్య అనిపించుకుంటుంది.  అలాగే, వేమన ఈ పద్యంలో ఈ మాట రాయలేదు కానీ, యవ్వనంలోనే కాకుండా అందం తరిగిపోయినప్పుడు కూడా భార్యను ప్రేమగా చూసుకున్నప్పుడే ఆదర్శవంతమైన భర్త అనిపించుకుంటాడు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more