grideview grideview
  • Dec 08, 11:58 AM

    vemana satakam - 37

      వేమన శతకం - 37 అలను బుడగ పుట్టినపుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి గనుటలేదు ఇలను భోగభాగ్య మీతీరె కానరు విశ్వదాభిరామ వినురవేమ! అలను బుడగ పుట్టినపుడే నీటి అలల మీద ఉద్భవించే బుడగ, క్షయమౌను నశించిపోతుంది, కలను...

  • Dec 05, 04:34 PM

    వేమన శతకం 36

    వేమన శతకం 36 ఏమి గొంచు వచ్చె తానేమి గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనములెచటికేగు దానెచ్చటికేగు విశ్వదాభిరామ వినురవేమ! ఏమి గొంచు వచ్చె=ఏం తీసుకొచ్చాడు, తానేమి గొనిపోవు=ఏం తీసుకుని పోతాడు, బుట్టు వేళ నరుడు గిట్టువేళ=మనిషి పుట్టిన సమయంలోనూ చనిపోయే...

  • Dec 01, 03:36 PM

    వేమన శతకం-35

    మృగమదంబు చూడ=కస్తూరిని చూస్తే, మీద నల్లగనుండు=నల్లగా ఉంటుంది, పరిఢవిల్లు=వ్యాపిస్తుంది, దాని పరిమళంబు=దాని సువాసన, గురువులైనవారి=నిజమైన గురువుల, గుణములీలాగురా=గుణమిలాగే ఉంటుంది.       చూడటానికి నల్లగా కనిపించే కస్తూరి, సువాసనలో మేటి అయినట్టుగానే, సద్గురువుల లక్షణాలు కూడా పైకి గొప్పగా కనపడవు. కస్తూరి అంటే...

  • Nov 29, 06:27 PM

    వేమన శతకం 34

    నేరనన్నవాడు=తనకు రాదు అని అనేవాడు, నెరజాణ=మంచి నేర్పరి, మహిలోన=ప్రపంచంలో, నేర్తునన్నవాడు=అన్నీ తెలుసన్నవాడు, నిందజెందు=అపకీర్తిపాలవుతాడు, ఊరకున్నవాడు=మౌనం పాటించేవాడే, ఉత్తమ యోగి=గొప్ప యోగి. తనకి అన్నీ తెలుసని బరిలోకి దూకినవాడు ఎప్పుడైనా బెడిసికొట్టినట్టయితే, మాటపోగొట్టుకునే అవకాశం ఉంది, నింద భరించవలసి రావొచ్చు అందుకే, నాకేం...

  • Nov 26, 02:30 PM

    వేమన శతకం - 33

    నిక్కమైన=నిజమైన, మంచి నీలము=ఇంద్రనీల మణి, ఒక్కటి చాలు=ఒక్కటే చాలు, తళుకుబెళుకు రాళ్ళు=రకరకాల రంగు రాళ్ళు, తట్టెడేల=తట్టడెందుకు, చాటుపద్యం=అందరికీ ఇష్టం కలిగించే చక్కని పద్యం, ఇలను=భూమ్మీద, ఒక్కటి చాలదా= ఒక్కటి సరిపోతుంది కదా! రంగురాళ్లు, గులకరాళ్ళు తట్టలకొద్దీ పోగుచేసుకున్నదానికంటే ఒక్క మంచి జాతి...

  • Nov 21, 02:49 PM

    వేమన శతకం -32

    పుట్టిన జనులెల్ల=పుట్టిన మనుషులంతా, భూమిలో నుండిన=బతికే ఉన్నట్టయితే, పట్టునా జగంబు వట్టిదెపుడు=భూమి సరిపోతుందా వట్టి మాట, యముని లెక్కరీతి అరుగుచు ఉందురు=యముడి దగ్గరున్న లెక్కప్రకారం వెళ్ళిపోతుంటారు పుట్టినవాళ్ళంతా భూమ్మీదనే ఉంటానంటే కుదురుతుందా? అసలు సరిపోతుందా అందరికీ? అందుకే యముడి ఖాతాలో రాసున్న...

  • Nov 17, 04:36 PM

    వేమన శతకం -31

    వేమన శతకం - 31 మైలకోక తోడ మాసిన తలతోడఒడలు మురికితోడ నుండనేమిఅగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరువిశ్వదాభిరామ వినురవేమ మైలకోకతోడ=మాసిపోయిన బట్టలతో, మాసిన తలతోడ=మురికిపట్టివున్న తలతో, ఒడలు మురికితోడ=ఒళ్ళఁతా మట్టిపట్టి, ఉండనేమి=ఉన్నట్లయితే, అగ్రకులజుడైన=అగ్రకులానికి చెందినవారినైనా సరే, నట్టిట్టు పిల్వరు=అటు ఇటు రమ్మని పిలవరు....