సాధారణంగా ఎఫైర్ల విషయానికొస్తే ఏ హీరోయిన్ అయినా కరెక్టుగా సమాధానం ఇవ్వదు. కొంతమంది ఎఫైర్లు నడుపుతున్నప్పటికీ.. తమ మధ్య ఏమీ లేవంటూ తప్పించుకుని తిరుగుతుంటారు. అటువంటివారిలో తాజాగా కేరళ బ్యూటీ లక్ష్మీమీనన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లకే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. లవ్ ఎఫైర్ల రూమర్లలోనూ మారుమోగుతోంది. ఓవైపు ఈమెకు లవ్ ఎఫైర్ల మీద వార్తలపై వార్తలు వస్తుంటే.. ఈమెమాత్రం చూసీ చూడనట్లుగా వుంటోంది. అసలు ఈ అమ్మడి వ్యవహారమేంటో తెలియాంటే.. కాస్త వివరణలోకి వెళ్లాల్సిందే!
వివరాల్లోకి వెళ్తే.. ఎక్కడో కేరళ గడ్డపై పుట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోతోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే విశాల్ సరసన ఏ మూవీ చేసినప్పటి నుంచి ఈ అమ్మడు అతనితో చాలా క్లోజ్ మూవ్ అవుతూ వస్తోంది. ఎంతగా అంటే.. వీరిద్దరిపై ఇప్పటికే ఎన్నో రూమర్లు క్రియేట్ అయిపోయాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవచ్చుననే వార్తలు ఆమధ్య కోలీవుడ్’లో జోరుగా సాగాయి. అయితే.. తమ మధ్య ఏమీ లేదంటూ లక్ష్మీ చాలాసార్లు కొట్టిపారేసింది. తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని ఈ కేరళ భామ ఎన్నిసార్లు మొత్తుకున్నా.. వారిద్దరి మధ్య ఎఫైర్ వున్నట్లు వార్తలు సాగుతూనే వచ్చాయి. అందుకే.. ఈ రూమర్లను ఫుల్’స్టాప్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుంది ఈ అమ్మడు!
ఇదివరకే విశాల్’తో రెండు మూవీలు చేసిన ఈ భామ.. తనతో ముచ్చటగా మూడోసారి నటించాల్సి వుండేది. కానీ.. తనకు ప్లస్-2 పరీక్షలు దగ్గరపడుతున్నాయంటూ ఆ అవకాశాన్ని వదులుకుంది. కానీ.. ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చల ప్రకారం.. విశాల్’తో వున్న వదంతులను వదిలించుకోవడం కోసమే ఆ చిత్ర అవకాశం వదులుకుందని సమాచారం! అయితే.. ఇక్కడో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. గతంలో ఈ అమ్మడు ప్రేమ వివాహమే చేసుకుంటానని ప్రకటించింది. కాబోయే వరుడు ఆరడుగుల అందగాడు, తనకంటే అధికంగా చదువుకున్నవాడు కావాలంటూ తెలిపింది. దీంతో మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆ ఆరడుగుల అందగాడు విశాలేనంటూ మళ్లీ వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో చివరగా.. తన వరుడు ‘సినిమావాడై వుండరాదు’ అంటూ స్టేట్’మెంట్ ఇచ్చి.. ఆ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
అంటే.. తనకు, విశాల్’కు ఎటువంటి లవ్ ఎఫైర్ లేదని అరచి మొత్తుకుంటున్నా.. రూమర్లు మాత్రం ఆగడం లేదు. అందుకే.. చివరగా సినిమావాడై వుండకూడదని తేల్చి చెప్పేసింది. దీంతో.. ఆమె కోరుకుంటున్న ఆరడుగుల బుల్లెట్ ఎవరై వుంటారా..? అనే సందిగ్ధంలో పడిపోయారు. ఏదైతేనేం.. ఓవైపు వరుస ఆఫర్లతోబాటు విశాల్ పేరుమీదుగా ఈ అమ్మడు ఫ్రీగా పబ్లిసిటీ సంపాదించేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం!
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more