Tamanna had no movie offers may says good bye to industry

tamannah latest movies, tamanna bhatia upcoming movies, thamanna movies in tollywood, tamanna bhatia in arya movie, tamanna bhatia koliwood issues, tamanna bhatia vs sruti hassan, sruti hassan in nagarjuna karthi multistarrer movie

tamanna had no movie offers to do : tollywood milky beauty tamanna have no offers now in tollywood at the same time she had no offers in bollywood also presently she is doing a movie with arya in koliwood, tamannah chance in nagarjuna karthi movie occupied by sruti hassan and with present situation tamannah have no offers

గందరగోళంగా కెరీర్.., త్వరలో రిటైర్మెంట్

Posted: 11/27/2014 08:30 AM IST
Tamanna had no movie offers may says good bye to industry

సినిమా అనే రంగుల లోకం ఎప్పుడు ఎవరి జీవితాల్లో వెలుగులు నింపుతుందో.., ఎప్పుడు ఎవరిని రంగుల ప్రపంచం నుంచి బయటకు పంపిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు తమన్నా ఇదే తరహా పరిస్థితి ఎదుర్కుంటోంది. టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మిల్కి బ్యూటికి ఇప్పుడు ఆఫర్లు లేవు. తలుపు తడుతున్న కొన్ని చాన్సులు కూడా సంతకం చేసే లోపు.., మరొకరి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. దీంతో ఇండస్ర్టీకి ఇక తమన్నా గుడ్ బై చెప్పేస్తుందా అని ఊహాగానాలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సహా ఇతర అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది తమన్నా. మిల్కీ బ్యూటిగా ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ మెయిన్ టైన్ చేసింది. అయితే కొద్దికాలంగా తమన్నా టైం బ్యాడ్ అయింది. అరటి పండు తిన్నా పన్ను విరుగుతోంది అన్నట్లుగా., ఏం చేసినా రిజల్ట్ మాత్రం నెగెటివ్ గా వస్తుంది. ఈ మద్య వచ్చిన సినిమాలు ఫ్లాపు అయ్యాయి. తాజాగా భారీ ప్రాజెక్టు ‘బాహుబలి’ లో నటించిన తమన్నా.., షూటింగ్ మద్యలో సెలవులు తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయి కొన్ని సన్నివేశాలు చేసింది. ఈ సినిమా తర్వాత తమన్నా చేతిలో ప్రాజెక్టులు లేవని తెలుస్తోంది. త్వరలో తెరకెక్కనున్న నాగార్జున-కార్తి మల్టీస్టారర్ సినిమాలో తమన్నా హీరోయిన్ అని ప్రకటించారు. అయితే అదంతా కేవలం పుకార్ల మహిహ అంటూ శృతి పేరును తెరపైకి తీసుకొచ్చారు. దీంతో తమన్నా ప్లేస్ లో ఈ ప్రాజెక్టులో శృతి నటిస్తుందని ఖాయం అయింది.

ఇక తమిళ ఇండస్ర్టీలో ఓ కుటుంబంతో ఉన్న విభేదాల కారణంగా మిల్కీ బ్యూటికి సినిమా చాన్సులు రావటంలేదు. కాని ఆర్య పిలిచి తన సినిమాలో చాన్స్ ఇవ్వటంతో సంతోషంగా చెన్నైకి వెళ్లిన తమన్నా ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు న్న సమాచారం ప్రకారం.., ఈ మూవీ పూర్తయితే తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా ఎలాంటి చాన్సులు లేవు. దీంతో తమన్నా కెరీర్ గందరగోళంలో పడిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మద్య వచ్చిన పెళ్లి పుకార్లు కూడా చాన్సులపై ప్రభావం చూపి ఉండవచ్చు. ఇండస్ర్టీలో ఓవర్ నైట్ స్టార్లు అయిన వారున్నారు. ఏళ్లుగా కష్టపడుతున్నా.., క్యారెక్టర్ ఆర్టిస్టు కాని వారు కూడా ఉన్నారు. అయినా సరే వీరు ఇండస్రీపై మక్కువ, సినిమాలపై ఆసక్తితో ఇంకా కొనసాగుతున్నారు. అయితే హీరోయిన్ల పరిస్థితి ఇందుకు పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్ గా నటించి.., పేరు, పాపులారిటి తెచ్చుకుని ఒక్కసారిగా చాన్సులు రాకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోలేము. కాని కాలం ఎప్పుడూ ఒక్కరి వైపే ఉండదు, కాబట్టి ఇవన్నీ సహజమే అనుకోవాలి.



కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  tollywood  nagarjuna  arya  koliwood  sruti hassan  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more