గోవా సుందరి ఇలియానా 'బర్ఫీ'తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగా ఆ సినిమా సెట్స్ మీద అనారోగ్యానికి గురైన ఇలియానా వల్ల నిర్మాత షూటింగ్ కేన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ లోకేషన్లో కేవలం కొద్ది సీన్లలోనే ఇలియానా పాల్గొనాల్సి ఉంది.
ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఆ సన్నివేశాల కోసం ఓ ప్రత్యేక సెట్‌ని నిర్మించారు.డైరెక్టర్ అనురాగ్ బసు సన్నివేశాలు తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఈలోగా ఇలియానా అస్వస్థతకు గురవడంతో షెడ్యూల్లోని చివరి రెండు రోజుల షూటింగుని కేన్సిల్ చేశాడు నిర్మాత. అంతేకాదు. గడువు ముగిసిపోవడంతో ఫిల్మ్ సిటీలో నిర్మించిన సెట్‌ని కూడా తీసేయాల్సి వచ్చింది.
కడుపునొప్పికి గురైన ఇలియానా స్వస్థత కోసం ముంబై నుంచి హైదరాబాద్‌కి వచ్చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇంతటితో నిర్మాతల కష్టాలు తీరలేదు. త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్న సినిమాపై కూడా దీని ప్రభావం పడింద్ది. ఈ సినిమాలో ఆమె అల్లు అర్జున్ జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సైతం ఆమె కారణంగా ఒకరోజు కేన్సిల్ అయ్యింది. ప్రస్తుతం కడుపునొప్పి నుంచి కోలుకున్న ఇలియానా ఈ నెల 16 నుంచి డార్జిలింగ్ లో జరిగే 'బర్ఫీ' షూటింగులో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more