F2 Review: V2 entertains F2 with More Fun Less Frustration ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) మూవీ రివ్యూ

Teluguwishesh ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) It is a simple and routine story about every married couple. What are the fun and frustration underwent by a couple and how to lead a happy life avoiding troubles is shown in a funny manner. Product #: 89499 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

 • బ్యానర్  :

  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

 • దర్శకుడు  :

  అనిల్‌ రావిపూడి

 • నిర్మాత  :

  దిల్ రాజు

 • సంగీతం  :

  దేవిశ్రీ ప్రసాద్‌

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  సమీర్‌రెడ్డి

 • ఎడిటర్  :

  బిక్కిని తమ్మిరాజు

 • నటినటులు  :

  వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్ రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, నాజర్‌ తదితరులు

F2 Fun N Frustration Moive Review

విడుదల తేది :

2019-01-12

Cinema Story

పటాస్, సుప్రీం, రాజా దిగ్రేట్ వంటి వరుస చిత్రాలతో హిట్ కోట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మరో మారు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సంక్రాంత్రి పర్వదినాన.. కొత్త అల్లుళ్లతో కలసి కుటుంబం మొత్తం చూడదగిన చిత్రాన్ని అందించాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడం తెలిసిన అనిల్ ఈ చిత్రంలోనూ అదే ఫార్ములాను వినియోగించాడు.

హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. వెంకీ (వెంక‌టేష్‌) హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. అప్పటివ‌ర‌కూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. భార్య‌, అత్త వెంకీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు య‌త్నిస్తుంటారు. హారిక సోదరి హనీని వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) ఇష్ట‌ప‌డ‌తాడు. అమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు అర్థ‌మైన వెంకీ.. హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్ యాద‌వ్‌ను హెచ్చ‌రిస్తాడు. ప్రేమ మ‌త్తులో వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్ట‌వు. చివ‌ర‌కు హ‌నీని పెళ్లి చేసుకుంటాడు.

అక్కాచెల్లెళ్ల ఆధిప‌త్యానికి తోడ‌ళ్లులు న‌లిగిపోవడం చూసిన పక్కింటి వ్యక్తి వారిని ఎక్క‌డికైనా వెళ్లిపోండ‌ని, అప్పుడే అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలిసి వ‌స్తుంద‌ని స‌ల‌హా ఇస్తాడు. దీంతో ఇద్ద‌రూ తోడళ్లులు యూర‌ప్ బయలుదేరి వెళ్తారు. అయితే, వాళ్లు వెంటే హారిక‌.. హ‌నీలు కూడా యూర‌ప్ బయలుదేరి వెళ్తారు. వీరంద‌రూ ప్ర‌కాష్ రాజ్ ఇంట్లో తిష్ట వేస్తారు. ఇంత‌కీ వీళ్లు యూర‌ప్ పర్యటనలకే ఎందుకు వెళ్తారు? ప‌్ర‌కాష్ రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగార‌న్న‌ది అస‌లు క‌థ‌. చివ‌ర‌కు వీళ్లు పెళ్లాల‌ మనసు మార్చారా? లేక వీళ్లే మారిపోయారా? అన్న‌ది సినిమా కథ సారాంశంలోకి వెళ్లాడం కన్నా దీనిని తెర‌పై  చూడాల్సిందే.

cinima-reviews
‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

విశ్లేషణ

భార్య బాధితుల జీవితాలు ఎలా ఉంటాయన్నది ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించినా.. వారి భాద ఇతరులకు ఎలాంటి వినోదం పుట్టిస్తుందో దర్శకుడు ప్రేక్షకులకు అందించాడు. బార్యబాధితులు ప‌డే ఇబ్బందుల నుంచి ఫ‌న్ ఎలా పుట్టుకొచ్చింద‌నేది సినిమాలో చూపించాడు. ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. భార్య బాధితుల చిత్రం అని చెప్పుకోచ్చినా.. సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లను టార్గెట్ చేసి.. వారికి అలర్ట్ చేసినట్లు వుంది చిత్రం.

‘నువ్వు నాకు న‌చ్చావ్‌’, ‘మ‌ల్లీశ్వ‌రీ’ లాంటి చిత్రాల్లో పండించిన కామెడీని మళ్లీ పండించాడు వెంక‌టేష్. తనదైన శైలిలో కామెడీలో అడియన్స్ ను మెప్పించి.. వెంకీ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా చేశాడు విక్టరీ వెంకటేష్. తొలి స‌గం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు. ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. మెహ‌రీన్‌కు కూడా ఒక మేన‌రిజం ఇచ్చి, ఆ పాత్ర ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేశాడు.

అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి క‌చ్చితంగా న‌వ్వుకుంటారు. సందర్భోచిత కామెడీ రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడు.ద్వితీయార్ధం మొత్తం యూర‌ప్ చుట్టూ తిరుగుతుంది. అయితే, ప్ర‌థ‌మార్ధంలో ఉన్న బ‌లం ద్వితీయార్ధంలో క‌నిపించ‌దు. కానీ, ఈ రెండు జంట‌లు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం కిక్ ఇస్తాయి. చివ‌రిలో నాజ‌ర్ పాత్ర ప్ర‌వేశించ‌డం కూడా క‌లిసి వ‌చ్చేదే. అక్క‌డ కూడా డైలాగ్‌లు చాలా బాగున్నాయి. మొత్తంగా ఇది ఒక ఫ‌న్ రైడ్ సినిమా.

కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా.. కామెడీనే కథకు బలంగా మార్చాడు దర్శకుడు. అందులోనూ వెంకీ మార్కు కామెడీకి బాగా అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు వరుణ్ తేజ్ తెలంగాణ యాసతో కలసి సంక్రాంతి పండగ నేపథ్యంలో మంచి విందును అందించాడు అనిల్. సందేశాల జోలికి వెళ్ల‌కుండా, సున్నిత‌మైన వినోదాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు. అయితే, వినోదాన్ని పండించ‌డంలో కొన్ని చోట్ల శ్రుతి మించిన‌ట్లు అనిపిస్తుంది. పాత్ర‌లు కూడా కొన్నిసార్లు ఓవ‌ర్ గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌నిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

వెంక‌టేష్ త‌న స్థాయికి త‌గ్గ వినోదం అందించే పాత్ర‌లో క‌నిపించారు. ఇద్ద‌రు తోడ‌ల్లుళ్ల ఫ్ర‌స్ట్రేష‌న్ అనే క‌న్నా, వెంక‌టేష్ ఫ్ర‌స్ట్రేష‌న్ అండ్ సజషెన్ అంటే బాగుంటుందేమో! ఎందుకంటే ఆయ‌న అనుభవించిన ఇబ్బందులు, ఎదుర్కోన్న సమస్యలను వరుణ్ చెప్పినా.. వరుణ్ మాత్రం అతన్ని లక్ష్యపెట్టకుండా సమస్యల సుడిగండంలో పడతాడు. వెంకటేష్ పాత్రే సినిమాలో హైలైట్‌. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించినా నవ్వులు పూయించినా.. తెలంగాణ యాస‌లో మాట్లాడటం అంతగా అప్పలేదు.

త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి హీరోయిన్ గా క‌నిపించింది. మెహ‌రీన్ కూడా ఈ చిత్రంలో బాగానే మెరిసింది. ఇక సీనియర్ నటులు, కమేడియన్లు రాజేంద్రప్రసాద్, ర‌ఘుబాబు, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు ఇలా ప్ర‌తి పాత్ర న‌వ్వించ‌డానికి ఉద్దేశించిందే! అన్న‌పూర్ణ‌, వై.విజ‌య జోడీగా క‌నిపించి న‌వ్వులు పంచారు. ర‌చ‌యిత‌గా అనిల్ రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. వినోదమే తన బలంగా చేసుకున్న అనిల్ రావిపూడి అదే బలంలో మరో హిట్ కొట్టేశాడు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

పండగ పూట అంతా సరదాగా గడపాలని, సినిమాను చూసి వెళ్లిన తరువాత అందులోని సన్నివేశాలను తలుచుకుని నవ్వుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రేక్షకులను నవ్వించాలన్న టార్గెట్ ను దర్శకుడు బాగానే చేరుకున్నాడు‌. అయితే ద్వీతీరార్థంలో చిత్రంలో కొన్ని సన్నివేశాలను జోడించి హస్యం పండించడానికి చేసిన ప్రయత్నాలు వినోదభరితంగా లేవని అనిపిస్తుంది. ట్విస్టులు, హంగుల‌వైపు వెళ్ల‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒకేలా ఉంది.

మొత్తానికి సంక్రాంతి వచ్చే కొత్త అల్లుళ్లతో బాధలు పడే అమ్మాయిల తల్లిదండ్రులు సినిమాలకు బదులు.. కొత్త అల్లుళ్లు పారాహుషార్ అంటూ అప్రమత్తం చేసేలా వుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. అయితే,  పాట‌లు అన్నీ ఆక‌ట్టుకోలేదు. యూర‌ప్‌లో తెర‌కెక్కించిన పాట మాత్రం బాగుంది. కెమెరా ప‌రంగా క‌ల‌ర్ ఫుల్‌గా ఉందీ సినిమా. కత్తెరకు కొంత పని చెప్పివుంటే బాగుండేందని ద్వీతీరార్థంలోని కొన్ని సన్నివేశాలు అనిపిస్తాయి. కథ ఇత్తివృత్తం ఇంకొంచెం సరదగా నడిపించివుంటే బాగుండేదనిపిస్తుంది. సినిమాలో డైలాగులు బాగా పండాయి. 

తీర్పు..

భార్య బాధిత చిత్రంలా కనిపించినా.. ఫుల్ లెంగ్త్ కామెడీతో తెరకెక్కి, తెలుగు ప్రేక్షకులను పండుగ వేళ నవ్వించే వినోదభరిత చిత్రం

చివరగా... సంక్రాంతి వేళ సరదాగా చడదగ్గ వినోదభరిత చిత్రం

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh