సినిమా పేరు : ’తుపాకి‘
విడుదల తేదీ: 13 నవంబర్ 2012
దర్శకుడు : ఎఆర్ మురుగదాస్
నిర్మాత : శోభ రాణి
సంగీతం : హరీష్ జైరాజ్
నటీనటులు : విజయ్, కాజల్ అగర్వాల్
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3
పరిచయం :
తమిళ్ స్టార్ హీరో విజయ్, అందాల భామ కాజల్ అగర్వాల్ జంటగా ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘తుపాకి’ సినిమాని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసారు. ఈ సినిమా తెలుగు నిర్మాత శోభా రాణి భారీ రేటుకు తెలుగు పంపిణీ పంపిణీ హక్కులు దక్కించుకున్న సంగతి మనకితెలుసు. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదలచేయాలని భావించినప్పటికీ తెలుగు వర్షన్ రిలీజ్ విషయంలో జాప్యం జరిగి కొంత ఆలస్యంగా విడుదలైంది. విడుదల విషయంలో కొంచెం అటు, ఇటు అయినప్పటికీ ప్రేక్షకులముందుకు వచ్చిన తుపాకి గురి కుదిరిందేమో చూద్దాం..
చిత్ర కథ :
జగదీష్ (విజయ్) ఒక సీక్రెట్ ఆర్మీ ఏజెంట్. పేరెంట్స్ కు దూరంగా ఉద్యోగం చేస్తుంటాడు. సెలవుల సమయంలో ఇంటికి వస్తే అతని పేరెంట్స్ నిషా (కాజల్ అగర్వాల్) తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. ఒక వైపు వీరిద్దరి లవ్ ట్రాక్ నడుస్తుండగా మరోవైపు టెర్రరిస్టులు ముంబై నగరంలో ఒక చోట బాంబు పేలుస్తారు. ఆ సమయంలో జగదీష్ అక్కడే ఉండడం ఆ బాంబు పెట్టిన టెర్రరిస్టుని పట్టుకుని ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఎంక్వయిరీలో మరిన్ని భయంకరమైన, విస్తుగొలిపే నిజాలను విజయ్ కనుగొంటాడు. వీటిని ఎలా చేధించి దేశాన్ని రక్షిస్తాడనేది చిత్ర సారాంశం.
అనుకూల ప్రతికూలాంశాలు :
తెలుగు ప్రేక్షకులకు ఇంకా అంతగా దగ్గరకాని విజయ్ ఈ సినిమాలో బాడీ లాంగ్వేజ్, నటనలో పరిణితి కనబరిచాడు. కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు బాగా రక్తికట్టించాడు. ఆర్మీ ఆఫీసర్ గా జీవించాడు. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ అభినయానికి పెద్దగా స్కోప్ లేదు. స్కిన్ షో, గూగుల్ గూగుల్ పాటలో డ్యాన్స్ సూపర్ అనిపిస్తుంది. విలన్ విద్యుత్ జమ్వాల్ మైండ్ గేమ్ సీన్స్ మూవీకి ప్లస్ అయ్యాయి. ఇంటర్వెల్ ముందు సీక్రెట్ ఆపరేషన్ ఎపిసోడ్లో మురుగుదాస్ తానేంటో చూపించాడు. ఎక్కడా బోర్ అనిపించకుండా స్క్రీన్ ప్లే నడుస్తుంది.
ఇక సినిమా విజయానికి ప్రతికూలంగా నిలిచిన అంశాలు బహు తక్కువనే చెప్పాలి. విజయ్, కాజల్ మధ్య రొమాంటిక్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఆర్టిఫీషియల్ గా తోస్తాయి. టైటిల్ తుపాకి రిత్యా ఆడియెన్స్ ఆశించే భారీ ఫైట్స్ పెద్దగా కనిపించవు.
టెక్కికల్ టీం వర్క్ :
హారిస్ జై రాజ్ సంగీతంలో మంచి సాంగ్స్ లేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో సంగీతం చాలా బావుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ఓకే. విజయ్, కాజల్ మధ్య సీన్స్ కొన్ని కట్ చేస్తే బెటర్.
చివరిమాట :
మురుగదాస్ డైరెక్షన్, విజయ్ నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడేలా చేస్తాయి. మొత్తంగా ప్రేక్షకులకు నిరాశ కలిగించకుండా తుపాకి తన టార్గెట్ రీచ్ అయింది.
..avnk