చిత్రం పేరు : రెబల్
విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2012
దర్శకుడు : రాఘవ లారెన్స్
నిర్మాత : జె. భగవాన్, జె. పుల్లా రావు
సంగీతం: రాఘవ లారెన్స్
నటీనటులు : ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్, కృష్ణం రాజు
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.25
పరిచయం :
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామలు తమన్నా, దీక్షాసేత్ నటించిన తాజా చిత్రం రెబల్. ప్రభాస్ ఇంతకు ముందు వచ్చిన సినిమాలు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రెండూ క్లాస్ సినిమాలు గానే తెరకెక్కిన నేపథ్యంలో మాస్ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ లారెన్స్ తో కలిసి ప్రభాస్ ఈ సినిమా చేశాడు.షూటింగ్ దశలో చాలా జాప్యం జరిగిన ఈమూవీ ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..
స్టోరీ సంక్షిప్తంగా :
రిషి (ప్రభాస్) స్టీఫెన్ – రాబర్ట్ కోసం వెతుకుతూ హైదరాబాదుకి వస్తాడు. వాళ్ళని వెతకడంలో నసరాజు (బ్రహ్మానందం) సహాయం తీసుకుంటాడు. బ్యాంకాక్లో ఉన్న నందిని (తమన్నా) ద్వారా స్టీఫెన్ – రాబర్ట్ లని పట్టుకోవచ్చు అని తెలుసుకొని బ్యాంకాక్ వెళ్తాడు రిషి. నందిని ప్రేమించినట్లు నటించి స్టీఫెన్ – రాబర్ట్ ఆచూకి సంపాదిస్తాడు. అసలు రిషికి స్టీఫెన్ – రాబర్ట్ లకి సంబంధం ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే డాన్ అయిన భూపతి (కృష్ణంరాజు) సొంత తమ్ముడి కొడుకు తప్పు చేసినా శిక్షించే ప్రజల కోసం న్యాయం చేస్తాడు. తన కొడుకు రిషి (ప్రభాస్) ని మాత్రం గొడవలకు దూరంగా పద్దతిగా పెంచాలనుకుంటాడు. రిషి మాత్రం తన తండ్రి లాగే డాన్ అవ్వాలనుకుంటాడు. భూపతి శత్రువుల్లో ఒకడైన సింహాద్రి (ప్రదీప్ రావత్) భూపతిని చంపాలని ప్లాన్ చేస్తాడు. రిషి తండ్రిని కాపాడుకున్నాడా లేదా? మరి స్టీఫెన్ – రాబర్ట్ ఎవరు అనేది మిగతా కథ.
అనుకూల ప్రతికూలాంశాలు :
రిషి, రెబల్ అనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ప్రభాస్ అలరించాడు. ప్రభాస్ ఎప్పుడూ చేయని కొత్త కోణం డాన్సుని ఈ సినిమాలో చూపించాడు. కేక, ఓరినాయనో పాటల్లో డాన్సులు బావున్నాయి. కృష్ణంరాజు పవర్ఫుల్ డాన్ గా భూపతి పాత్రలో ఓకే అనిపించాడు. నందిని పాత్రలో తమన్నా అందాల ఆరబోత. డ్యాన్స్ సైతం ఊదరగొట్టింది. దీపాలిగా దీక్ష సేథ్ చిన్న పాత్రే అయినప్పటికీ తన పాత్ర పరిది మేరకు పర్వాలేదనిపించింది. బ్రహ్మానందం పాత్ర ఓ మాస్తరుగా నవ్వుతెప్పించింది. ఇక సినిమా లెగ్త్ బాగా ఎక్కువయ్యి బోర్ కొట్టించింది. బ్రహ్మి, కోవై సరళ మీద సోది కామెడీ ట్రాక్ విసుగుతెప్పించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అలీ కామెడీ సీన్ కొంత నవ్వించినా ఆ సీన్ కూడా లెంగ్తీగా ఉంది. ఇంటర్వెల్ ముందు ఫైట్స్ బావున్నప్పటికీ 30 మంది రష్యన్ ఫైట్ మాస్టర్స్ తో చేయించిన క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకోలేదు. కథ,కథనంలో డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపించింది.
టెక్నికల్ టీం వర్క్ :
సినిమాటోగ్రఫీ విషయంలో సి. రామ్ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బావున్నాయి. లారెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా కేక, ఓరినాయనో పాటల విషయంలో సక్సెస్ అయితే, కొరియోగ్రాఫర్ గా అన్ని పాటల్లోనూ అదరగొట్టాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకె.
ముగింపు :
ప్రభాస్ కెరియర్ లోనే భారీగా, నిర్మాతలు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకోవటం సందేహాస్పదమే.
...avnk