Teluguwishesh dirty-picture1.gif dirty-picture1.gif dirty picture review, Movie reviews, Telugu cinema, Movie actors photos, Jokes, Latest movie trailers, Indian recipes, Photo gallery, Telugu video songs online, Telugu songs, Movie reviews, Telugu cinema, Movie actors photos Product #: 29729 stars, based on 1 reviews
 • Movie Reviews

  dirty-picture-photo"ది డర్టీ పిక్టర్" అంటూ ''ఎ'' సర్టిఫికేట్ తో విడుదలైన చిత్రం మురికి చిత్రం కాదు! మురికి గురించి చెప్పే విషయాలు మలినమైనవెలా అవుతాయ?. స్కిప్ట్ చాలా బాగా నడిచింది. ఫ్లాష్ బ్యాక్ లేమీ లేకుండా నేరుగా కథ చెప్పిన విధానం చాలా బాగుంది. మొత్తం సినిమాకంతా విద్యా బాలన్ కేంద్ర స్థానం. ఆ భారాన్ని విద్యా చాలా అద్భుతంగా మోసింది. సినిమాలో విద్యా లేని ఫ్రేంలు చాలా అంటే చాలా తక్కువే. ఆ కాసిన్ని ఫ్రేంలు కూడా విద్యాలేకపోవటం వలన డల్ గా అనిపిస్తాయి. ఇతర ముఖ్యపాత్రల్లో నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మి చక్కటి నటనను ప్రదర్శించి తమవంతు పాత్రలను యధోచితంగా పోషించారు. తుషార్ కూడా తన శాయశక్తులా నటసహాయాన్ని అందించాడు.

  సినిమా పరిశ్రమలో బయటకు చెప్పుకోలేని నిజాలెన్నో ఉన్నాయి. వాటిల్లో మచ్చుకి కొన్నే చూపించినా వాటిని చూపించిన విధానం చాలా బాగుంది. వెనకా ముందూ ఎవరూ లేక కేవలం తన నటనతోనే రాణిద్దామని, అదృష్టం మీదనే ఆధారపడి సినిమా రంగానికి వచ్చేవారి దుస్తితి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎలా ఉంటుందో ఊహలకు అందేదే. అయినా హీరో ముద్ర వేసుకున్నవారు అధికారం చెలాయించి కొత్త హీరోయిన్లను ఎలా వశపరచుకుంటారన్నది, ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయిన సందర్భాల్లో వారి బ్రతుకులు ఎలా ఉంటాయన్నది చక్కగా చూపించిన దర్శకుడు మిలన్ లూథ్రియా ప్రశంసనీయుడు.

  డైలాగ్స్ సందర్భోచితంగా ఉన్నాయి. కథలో పాత్రలు, పాత్రధారులు ఒదిగిపోయి సినిమాలో భాగంగా కనిపించారు కానీ ప్రత్యేకంగా విడిగా గుర్తించే విధంగా లేరు. విద్యా బాలన్ హావభావాల ముందు ఆమె చూపించిన శృంగారం నిజంగా తీసికట్vidya-imgటే. సినిమాలో కూర్చున్నవారు విద్యా అందాలను చూసేదానికంటే, ఆమె కనబరచిన పాత్ర ఔచిత్యాన్నే ఎక్కువగా గమనించటం గమనార్హం.

  సినిమాకి ఆయువుపట్టైన సన్నివేశాలు బాగా పండాయి. ముఖ్యంగా సినిమాలో సిల్క్ కి పురస్కారం లభించిన సన్నివేశంలో విద్యా నటన, ఆమె ప్రసంగం కాని ప్రసంగం, చెప్పే విధానం బాగా ఆకట్టుకుంటాయి.

  స్త్రీ శృంగార దేవతగా కనిపించాలి, అలరించాలి, శృంగారాన్నందించాలి కానీ, ఇంటి బయటే ఉండాలి, అటువంటి ఆడది మురకి కూపంలోనే ఉండాలి, తన వ్యక్తిగత జీవితంలో భాగం కాగూడదనుకునే పురుష జాతిలో కొందరికి ఈ చిత్రం కనువిప్పు కలుగుతుందని అనుకోము కానీ అందరినీ ఆలోచింపజేస్తుంది, అయితే వినోదాత్మకంగానే. ఒక నీతిని చెప్తున్నట్టుగా కాదు. నేను కావాలి, నా అందం కావాలి, నా శృంగారం కావాలి అని కోరుకునేది మీరే మళ్ళీ నన్ను మురికి అని కూడా అనేది మీరే అని సిల్క్ అన్న మాటలు హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయి.

  దక్షిణాది తార సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసామని మొదట్లో జరిగిన ప్రచారం ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించటానికి బాగా పనికి వచ్చింది. విద్యా బాలన్ అంతకు ముందు వేసిన పాత్రలకు భిన్నమైన ఈ సిల్క్ పాత్రను ప్రేక్షకులు ముందు సమ్మతించకపోతే, దానికి మానసికంగా తయారుగా లేకపోతే ఈ సినిమాను ఎంజోయ్ చెయ్యటం కష్టం కాబట్టి సిల్క్ స్మిత జీవిత చరిత్ర అంటూ చేసిన ప్రచారం చాలా తెలివైన పని.

  మేరా నామ్ జోకర్ లో జోకర్ ప్రేక్షకులను అలరించటానికే, కడుపుబ్బా నవ్వించటానికే తన జీవితమంతా వెచ్చించినట్టు, చిన్నదైన ఒక శృంగార దేవత జీవితం కూడా కడ వరకూ చుట్టూ ఉన్నవారిని శృంగారంలో ముంచి లేపటానికే పనికివస్తుంది కానీ ఆమెను సొంతం చేసుకోవటానికి కాదు.

  కేవలం అందమే తన పెట్టుబడిగా ఉన్న అటువంటి నటి వయసు ఉడిగిపోవటం వలన కానీ, అందం తరిగిపోవటం వలన కానీ, లేదా ఆ అందం ముఖం మొత్తి కానీ ఆదరణ తక్కువై ఆర్థిక సమస్యలకు దారితీసినప్పుడు వారి బ్రతుకింకా దుర్భరమౌతుంది. అయితే ఈ విషయాలన్నీ, సినిమా ప్రారంభంలో ఉన్నంత పట్టుతోనే వినోదాత్మకంగా చివరివరకూ నడిపించి సినిమాను చక్కగా మలిచిన దర్శకుడు, పాత్రధారులు, సాంకేతిక నిపుణులు కృషి అభినందనీయం.

  తప్పకుండా చూడవలసిన సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు.

  -శ్రీజ

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com