నారా లోకేష్ బాబు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ట్విట్టర్ లోకేష్ బాబు అంటే మాత్రం అందరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు అనే గుర్తింపు కంటే.. ట్విట్టర్ లోకేష్ బాబు అంటే.. తెలుగు ప్రజలకు తెలుస్తోంది. సమైక్యాంద్ర కోసం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తున్న విషయ తెలిసిందే. అయితే తండ్రి దీక్షకు మద్దతుగా లోకేష్ బాబు ఢిల్లీలో హల్ చల్ చేస్తున్నారు. ఢిల్లీలో లోకేష్ బాబు హడావుడి అంత ఇంత కాదని జాతీయ మీడియా అంటుంది. అయితే లోకేష్ బాబు ట్విట్టర్లో మళ్లీ టీడీపీ బాంబులు పేల్చారు. చంద్రబాబు చేస్తున్న దీక్ష గురించి, కొత్తగా రాయటం జరిగింది. చంద్రబాబు తన దీక్ష ద్వారా కేవలం 24 గంటల్లోనే దేశం మొత్తాన్ని ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా చేశారని తన వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు.
తన తండ్రి చంద్రబాబు దీక్షకు వచ్చిన స్పందన చూడలేకే ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ ఇక్కడ నుంచి పంపించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై చర్చించడానికి ఇరు ప్రాంతాల నేతలను చర్చలకు పిలిచేంతవరకు దీక్ష శిబిరం నుంచి కదలం అని ట్విట్టర్ బాబు లోకేష్ అన్నారు. అయితే ఇప్పటి వరకు లోకేష్ బాబు తన తండ్రి దీక్ష గురించి చెప్పటం జరిగింది. కానీ 70 రోజుల నుండి సమైక్యాంద్ర కోసం సీమాంద్రలో ఉద్యమం జరుగుతుంటే.. లోకేష్ బాబుకు కనిపించలేదా? లేక సీమాంద్ర ప్రజల ఆత్మగోష వినిపించలేదా? అప్పుడేప్పుడో .. ఉత్తరఖండ వరద బాధితులకు సహాయం చేసే సమయంలో కనిపించినే లోకేష్ ఇన్ని రోజులు ఎక్కడున్నవ్? ఏం చేస్తున్నావ్? రెండు కళ్ల సిద్దాంతంతో.. మీ తండ్రి తెలంగాణకు అనుకులంగా లేఖ రాసినప్పుడు ఏం చేశావ్? ఇప్పుడు మీ తండ్రి ఢిల్లీలో దీక్ష చేస్తుంటే బయటకొచ్చావ్? అంతేకానీ, తెలుగు ప్రజల కోసమో, సమైక్యాంద్ర కోసమో .. మీరు బయటకు రాలేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది.
తండ్రి ఒక్కరోజు దీక్ష చేస్తేనే.. నీవు ఇలా .. ట్విట్టర్లో కామెంట్స్ రాసి పెడుతున్నావ్? తెలుగు ప్రజలు, తెలుగు జాతి కోసం స్థాపించిన టిడిపి ఆశయాల కోసమైన.. ఒకే ఒక్క రోజు.. సమైక్యాంద్ర ఉద్యమంలో ఎందుకు పాలుపంచుకోలేదని .. తెలుగుప్రజలు అడుగుతున్నారు. తెలుగు ప్రజలు వేసే ఓట్లు కావాలి గానీ, వారే పడే బాధలు మాత్రం మీలాంటి రాజకీయ నాయకులకు వద్దు అనే విషయం బాగ అర్థమైంది. రాష్ట్ర విభజన జరుగుతుంది, తెలుగు జాతి రెండుగా విడిపోతుంది , అల్లోరామచంద్రా అని.. సీమాంద్ర ప్రజలు గొంతెత్తి అరుస్తున్న మీకు వినిపించలేదా? తెలుగు ప్రజల ఉద్యమాం గురించి మీరేందుకు ట్విట్టర్లో పోస్టుచెయ్యలేదు. అంటే.. మీరు తెలుగు వారు కాదా? మీకు తెలుగు జాతి మీద గౌరవం లేదా? యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీలాంటి యువ నాయకులు ఎందుకు వెనకడుగు వేశారో .. ముందు తెలుగుప్రజలు చెప్పాలి? ఢిల్లీలో మీ తండ్రిగా చేసే ధీక్ష వల్ల , మీకు , మీకుటుంబానికి ఉపయోగం ఉంటుందేమో గానీ, సీమాంద్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని సమైక్యవాదులు అంటున్నారు.
మీ తండ్రి గురించి మీరు గొప్పగా చెప్పటం బాగాలేదు. ఎందుకంటే.. మరో రాజకీయ నాయకుడు అయిన జగన్ కూడా .. హైదరాబాద్ లో సమైక్యాంద్ర కోసం దీక్ష చేస్తున్నారు. కానీ ఇలాంటి దీక్షలకు తెలుగు ప్రజల నుండి ఎలాంటి స్పందన రాలేదు. కానీ సీమాంద్ర ప్రజలు నిజమైన నాయకుడు కోసం ఎదురుచూస్తున్నారు. మీడియా ముందు ముఖ భావాలు చూపిస్తూ, నటిస్తూ , తెర వెనుక విశ్వరూపం చూపించే రాజకీయ నాయకులను దూరంగా ఉంచుతున్నారు సమైక్యవాదులు. ఎలాంటి రాజకీయ కల్మషం లేని నాయకుడు కోసం సీమాంద్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇలా మీ గురించి డప్పు కొట్టుకోవటం ముఖ్యం కాదు, సమైక్యాంద్ర కోసం ప్రజలతో కలిసి పోరాడితే..ఫలితం ఉంటుందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. బాబు లోకేష్ .. ట్విట్టర్ల పోస్టుల ద్వారా సాధించేది ఏం ఉండదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటే అందరికి బాగుంటుందని.. సమైక్యవాదులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more