Political cm kiran kumar reddy speech on telagana issue

cm kiran kumar reddy, congress party, trs party leaders, trs mlas, tdp, telangana issue, tdp chandra babu naidu, telangana state, sonia gandhi, breaking news, ap politics, political news, andhra news

cm kiran kumar reddy speech on telagana issue

తెలంగాణ ఇవ్వటం నాకు ఇష్టమే సిఎం కిరణ్

Posted: 06/19/2013 01:34 PM IST
Political cm kiran kumar reddy speech on telagana issue

నిన్నటి వరకు ప్రత్యేక తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నారు, తెలంగాణ శత్రువు అన్న టిఆర్ఎస్ నాయకుల నోళ్లుమూయించాడు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసే నాయకులకు సీఎం మాటలు ఆనందాన్ని కలిగించాయి. ఆయన మాటలు వినటానికే ఇంత బాగుంటే ఇక తెలంగాణ ఇస్తే ఇంకేంత బాగుంటుందోనని తెలంగాణ వాదులు అనుకుంటున్నారు. శాసనసభ సాక్షింగా సిఎం కిరణ్ టిఆర్ఎస్ ఎమ్మెల్య ముందు, తెలంగాణ పై రుచికరమైన మాటలు మాట్లాడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. శాసనసభ మొదలై ఆరు రోజులు దాటిన ఒక్క రోజు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం సభలో ఏ ఒక్క నాయకుడుకు లేదు. టిఆర్ఎస్, బిజేపి, సిపిఐ, సీపిఎం, నాయకులు తెలంగాణ పై తీర్మానం సభలో పెట్టాలని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టిడిపి నాయకులకు ఏ సమస్య దొరకనట్లు ..‘కళంకిత’ మంత్రులు అంటూ వారు గోల చేస్తున్నారు. ఇక వైసీపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం సైలెంట్ గా సభలో ఏం జరుగతుందో చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో సభలో ప్రతిపక్ష నాయకులు పదే పదే కళంకిత మంత్రులు అంటూ గోల చెయ్యటం, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అంటూ అల్లరి చెయ్యటంతో.. సీఎం కు ఒక్కసారిగా చిరెత్తుకొచ్చి.. అద్యక్ష... అంటూ మైకు తీసుకొని 30 నిమిషాల పాటు అందరికి సమరసమైన సమాధానం చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ సమస్య చిన్నది కాదు.. దాని కోసం కొంచెం సమయం పడుతుంది. కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ సమస్య ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ ఇవ్వటం నాకు ఇష్టమే. తెలంగాణ సమస్య పై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం సమన్వయం పాటించాలని టిఆర్ఎస్ నాయకులను సీఎం కోరటం జరిగింది. అయితే టిడిపి నాయకులకు చురకలుఅంటించారు.కళంకిత మంత్రులు అంటూ అరుస్తున్నా నాయకులే కళంకితం అయ్యారు. కాంగ్రెస్ నాయకులపై ఆరోపణాలు వచ్చాయి.

అవి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవటం మంచికాదని టిడిపి నాయకులపై సీఎం మండిపడ్డారు. అద్యక్ష మీరు కొంచెం సమయం ఇస్తే... టిడిపిలో ఉన్న కళంకిత నాయకులు లెక్కలు చెబుతానని ముఖ్యమంత్రి సభలో రెచ్చిపోవటంతో.. సభపతి వెంటనే సభను రేపటికి వాయిదా వేయటంతో.. సభలోని కాంగ్రెస్ నాయకులు నవ్వుకుంటూ బయటకు రావటం జరిగింది. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆనందంగా సీఎంమాట్లాడిన మాటలు చాలా రుచిగా ఉన్నాయాంటూ గుసగుసలాడుకుంటూ సభను వదిలి బయటకు వెళ్లిపోయారు. సీమాంధ్ర నాయకులు మాత్రం సీఎం పై కోపంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more