తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జగన్ పార్టీలో గుర్తింపు లభించింది. ఉమ్మారెడ్డి 1985 నుంచి టిడిపిలో ముఖ్య నేతగా కొనసాగారు. ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్.పిగా,కేంద్ర మంత్రిగా పనిచేసిన ఈయన చంద్రబాబు బృందంలో ప్రముఖుడుగానే ఉండేవారు.ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతిడిని చేసిన సందర్భంలో తీర్మానాల తయారీలో ప్రముఖ పాత్ర వహించారు.అప్పటినుంచి టిడిపిలో మానిఫెస్టో కమిటీ, సభ్యత్వాలు, తదితర అంశాలలో ఆయనను ఉపయోగిస్తుండేవారు. రాజ్యసభ సీటును ఆశించిన ఉమ్మారెడ్డికి అది దక్కలేదు. అంతేకాక, కారణం ఏమైనా చంద్రబాబు ఆదరణకు కూడా ఈయన దూరం అవడంతో అసంతృప్తికి లోనై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. ఈయన అనుభవాన్ని పార్టీ నిర్మాణానికి వాడుకోదలచినట్లున్నారు. ఆఫీస్ లో కూర్చుని వివిద కార్యక్రమాలు చేపట్టడంలో ఉమ్మారెడ్డికి మంచిపేరే ఉంది. సుదీర్ఘ అనుభవం కలిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో క్రమేపి ప్రాధాన్యత పెరుగుతోంది. ఆయనను సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్ గా నియమించారు. ఆయన మొదటి నుంచి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత సలహాదారు పదవికి రాజీనామా చేసి ఇక్కడ చేరిపోయారు. మంచి స్థాయిలో ఉన్న నాయకుడికి ఇలాంటి పదవి రావటతో టిడిపి నాయకులు నవ్వుకుంటున్నారు. పార్టీ వీడిన ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సేవాలన్ని గుర్తించి ఈ పదవి ఇచ్చినట్లు ఉందని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో మంచి పేరు ఉన్న ఉమ్మారెడ్డికి చిన్న పదవి ఇచ్చిన ఆయన్ని అవమానినట్లుగా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. పార్టీ లో పెత్తనం చేద్దామని వచ్చిన పెద్దకు జనభా లెక్కలు రాసుకొని పదవి ఇవ్వటంపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిమానులు మండిపడుతున్నారు. సుధీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి సరైన ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దూరపు కొండలు నూనుపు అనేది ఉమ్మారెడ్డి విషయంలో రుజువైందని టిడిపి నాయకులు అంటున్నారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more